Hyderabad : ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో ఉరేసుకున్న అక్కాతమ్ముడు!

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశవ్ నగర్ కాలనీలో చామంతి (26) మహిళ. శేఖర్ (25) వ్యక్తి. ఇద్దరు ఒకే ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.చామంతికి దూరపు బంధువైన శేఖర్ తమ్ముడి వరస అవుతాడు. తన ఇంట్లోకి వచ్చి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు తెలియ లేదు.

New Update
Hyderabad : ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో ఉరేసుకున్న అక్కాతమ్ముడు!

Hyderabad Crime : వరుసకు సోదరుడయ్యే వ్యక్తితో కలిసి ఓ వివాహిత ఆత్మహత్య(Suicide) కు పాల్పడింది. ఆ మహిళ ఇంట్లోనే ఇద్దరు వేర్వేరు గదుల్లో ఫ్యానుకు ఉరివేసుకున్నారు. రాజేంద్రనగర్‌(Rajendra Nagar) ఠాణా పరిధి హైదర్‌గూడ గుమ్మకొండకాలనీలో ఈ ఘటన వెలుగుచూసింది. ఇన్‌స్పెక్టర్‌ నాగేంద్రబాబు, బాధిత కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం ధర్మారానికి చెందిన సోమేష్‌కు సూర్యాపేట జిల్లా కాసరబాదుకు చెందిన చామంతి (28)తో 2010లో పెళ్లి జరిగింది.

పదేళ్ల క్రితమే వారు అత్తాపూర్‌కు వచ్చి స్థిరపడ్డారు. వారికి ఓ కుమారుడు, ఓ కుమార్తె సంతానం. ఐదేళ్ల క్రితం గుమ్మకొండకాలనీలో సోదరుడు నర్సింహులుతో కలిసి సోమేష్‌ ఓ ఇల్లు కొన్నాడు. మొదటి అంతస్తులో భార్యాపిల్లలతో కలిసి నర్సింహులు ఉంటుండగా కింది అంతస్తులో సోమేష్‌ కుటుంబం నివసిస్తోంది. సోమేష్‌ పలు కార్యాలయాలకు నీటిని సరఫరా చేస్తుండగా ఆయన భార్య చామంతి ఇళ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.

నర్సింహులు బావమరిది అయిన యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలం చిర్రగూడూరుకు చెందిన శేఖర్‌(25) ఆర్నెల్ల క్రితం బావ వద్దకే వచ్చి ఉంటూ రెండు కుటుంబాలతో సఖ్యతతో మెలుగుతున్నాడు. మంగళవారం ఉదయం సోమేష్‌, నర్సింహులు, ఆయన భార్య సూర్యాపేటలో ఓ దశదినకర్మ కార్యక్రమానికి వెళ్లారు. ఉదయం ఎనిమిది గంటలకు పిల్లలను పాఠశాలకు పంపించిన చామంతి 10.30కు తల్లికి ఫోన్‌చేసిమాట్లాడింది.

మధ్యాహ్నం 3.30 గంటలకు ఇంటికి వచ్చిన పిల్లలు తలుపుతట్టగా తల్లి తీయలేదు. కిటికీ నుంచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో కుమారుడు చుట్టుపక్కలవారికి చెప్పడంతో వారంతా తలుపు బద్ధలు కొట్టిచూడగా హాల్లో చామంతి(Chamanthi), పడకగదిలో శేఖర్‌(Sekhar) ఉరేసుకుని కనిపించారు. సమాచారమందుకున్న పోలీసులు వచ్చి మృతదేహాలను పరిశీలించి ఆత్మహత్యకు పాల్పడినట్లు ధ్రువీకరించారు.

అనంతరం ఉస్మానియా(Osmania) కు తరలించారు. వీరు ఎందుకు బలవన్మరణాలకు పాల్పడ్డారనే దానిపై స్పష్టతలేదు. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధముందా? అనే అనుమానాలను పోలీసులు, స్థానికులు వ్యక్తంచేస్తున్నారు.

Also read : సోషల్‌ మీడియా వేదిక వంగవీటి..బోండా వర్గీయుల వార్‌!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

PUB CASE: హైదరాబాద్‌ పబ్‌ల్లో న్యూడ్ డ్యాన్స్ లు.. 17 మంది అమ్మాయిలు అరెస్టు!

హైదరాబాద్‌ చైతన్యపురిలో వైల్డ్‌హార్ట్స్ పబ్‌ గుట్టురట్టు రట్టైంది. కస్టమర్లను ఆకర్షించేందుకు పబ్‌లో అమ్మాయిలతో న్యూడ్ డ్యాన్స్‌లు చేయిస్తున్నారనే సమాచారంలో పోలీసుల దాడులు చేశారు. పబ్‌ ఓనర్‌తో పాటు 17 మంది ముంబైకి చెందిన అమ్మాయిలను అరెస్ట్‌ చేశారు. 

New Update
pub hyd

Hyderabad Chaitanyapuri Wildhearts Pub

PUB CASE: హైదరాబాద్‌ చైతన్యపురిలో వైల్డ్‌హార్ట్స్ పబ్‌ గుట్టురట్టు రట్టైంది. కస్టమర్లను ఆకర్షించేందుకు పబ్‌లో అమ్మాయిలతో న్యూడ్ డ్యాన్స్‌లు చేయిస్తున్నారనే  సమాచారంలో పోలీసుల ఆకస్మిక దాడులు చేశారు. పబ్‌ ఓనర్‌తో పాటు 17 మంది ముంబైకి చెందిన అమ్మాయిలు, పలువురు కస్టమర్లు అరెస్ట్‌ చేశారు. 

updating..

Also Read: రెమ్యునరేషన్‌కు లింగ భేదం ఏంటీ..? ఆసక్తికర విషయాలు వెల్లడించిన సమంతా

Also Read: 'పెద్ది'తో రామ్ చరణ్ ఊచకోత.. ఇదయ్యా నీ అసలు రూపం..!

girls nude video leak | telugu-news | today telugu news

 

Advertisment
Advertisment
Advertisment