AP Politics: విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మంత్రిగారి భార్య.. ఆసక్తిగా ఉత్తరాంధ్ర రాజకీయం! విశాఖ ఎంపీ అభ్యర్థిగా మంత్రి బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీని రంగంలోకి దించే ఆలోచనలో వైసీపీ ఉంది. గతంలో విజయనగరం ఎంపీగా పని చేశారు ఝాన్సి. సామాజిక సమీకరణాల దృష్ట్యా ఝాన్సీ పేరును జగన్ ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. By Trinath 07 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి ఏపీ(AP)లో ఉత్తరాంధ్ర రాజకీయాల రూటే వేరు.. మిగిలిన ప్రాంతాల రాజకీయం ఒక విధంగా అయితే అక్కడి మాత్రం రాజకీయం నిత్యం రంజుగా ఉంటుంది. బడా పార్టీల కన్ను ఎప్పుడూ ఉత్తరాంధ్ర రీజియన్‌వైపే ఉంటుంది. పెద్ద నేతల సైతం ఇక్కడ నుంచే పోటి చేస్తుంటారు. ప్రచార పర్వం కూడా ఉత్తరాంధ్ర నుంచే మొదలుపెడుతుంటారు. రానున్న ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో హోరాహోరీ ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా విశాఖ ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి ఎవరు పోటి చేస్తారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే బొత్స సత్యనారాయణ(Botsa Satyanaranaya) భార్య.. ఝాన్సీ(Jhansi) పేరు తెరపైకి వచ్చింది. రంగంలోకి ఝాన్సీ: విశాఖ ఎంపీ అభ్యర్థిగా మంత్రి బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీని రంగంలోకి దించే ఆలోచనలో వైసీపీ ఉంది. గతంలో విజయనగరం ఎంపీగా పని చేశారు ఝాన్సి. సామాజిక సమీకరణాల దృష్ట్యా ఝాన్సీ పేరును జగన్ ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో బొత్స కుటుంబానిది ప్రత్యేక స్థానం. ఇక పార్టీ నిర్ణయానికి బొత్స అంగీకరించినట్టుగా అర్థమవుతోంది. ఇక సిట్టింగ్ ఎంపీ MVV సత్యనారాయణను విశాఖ తూర్పు అభ్యర్థిగా వైసీపీ ఇప్పటికే ప్రకటించింది. ఉత్తమ పార్లమెంటేరియన్: బొత్స ఝాన్సీ లక్ష్మి .. మల్టి టాలెంటెడ్ విమెన్. విజయనగరం నుంచి 2009-14 మధ్య లోక్ సభకు ప్రాతినిధ్యం వహించిన ఝాన్సీ ఇటీవల హైకోర్టు న్యాయవాదిగా మారారు. ఎంఏ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేసిన ఝాన్సీ గతేడాది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్లో చేరారు. రిజిస్టర్ చేసుకుని ప్రాక్టీస్ ప్రారంభించారు. ఒకవైపు రాజకీయాల్లో ఉంటూనే ప్రజాసేవ చేస్తూనే ఉన్నత చదువులు పూర్తి చేశారు. గతంలో రెండుసార్లు లోక్ సభకు ఎన్నికైన ఝాన్సీ ఉత్తమ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందారు. విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్ గా రెండుసార్లు, బొబ్బిలి ఎంపీగా, విజయనగరం ఎంపీగా ప్రజాసేవ చేశారు. క్రియాశీలక రాజకీయాల్లో బిజీగా ఉంటూనే ఆమె చదువును కొనసాగించారు. రాజకీయాల్లో మహిళా సాధికారత కోసం ప్రయత్నించిన ఝాన్సీ ఉన్నత విద్యను అభ్యసించారు. ఎంపీగా ఉన్న సమయంలో ఫిలాసఫీ, విమెన్ ఎంపవర్మెంట్, సోషల్ లాలో PHD పూర్తి చేశారు. Also Read: ట్రంప్‌గారి నిర్వాకం.. 17వేల మంది బలి..! ఆ మెడిసిన్ సంజీవని కాదు.. మృత్యువుకు దారి..! #ycp #vizag #ap-politics-2024 #ap-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి