Botsa Satyanarayana: నిజాయితీ పరుడైతే కోర్టులో నిరూపించుకోవాలి

చంద్రబాబు నిజాయితీ పరుడైతే కోర్టులో నిరూపించుకోవాలని మంత్రి బోత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక అవినీతి కార్యక్రమాలు చేశారని బొత్స మండిపడ్డారు.

New Update
Botsa Satyanarayana : డ్రగ్ కంటైనర్ వ్యవహారంపై విచారణ జరపాలి: మాజీ మంత్రి బొత్స

చంద్రబాబు నిజాయితీ పరుడైతే కోర్టులో నిరూపించుకోవాలని మంత్రి బోత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక అవినీతి కార్యక్రమాలు చేశారని బొత్స మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి అవినీతిని అధికారులు బయటపెట్టారన్న ఆయన.. చట్టం ముందు అందరూ సమానులే అన్నారు. ఎవరు తప్పు చేసినా చట్టం నుంచి తప్పించుకోలేరని మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. ఆయన అవినీతిని న్యాయ వ్యవస్ధలు కూడా ధృవీకరిస్తున్నాయని, ప్రజా ధనాన్ని అడ్డంగ దోచుకన్న వ్యక్తి ఇప్పుడు చిప్పకూడు తింటున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయంలో కూడా చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు.

ఎన్టీఆర్‌కు వెన్నూపోటు పోడిచిన చంద్రబాబు ఇప్పుడు జైల్లో ఉండటంతో ఎన్టీఆర్‌ ఆత్మ శాంతించి ఉంటుందన్నారు. మరోవైపు టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బొత్స సత్యనారాయణ.. చంద్రబాబును అరెస్ట్‌ చేశారని రాష్ట్ర వ్యాప్తంగా హింస సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చంద్రబాబును అరెస్ట్‌ చేయడాన్ని నిరసిస్తూ టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చిందన్న ఆయన.. రాష్ట్ర ప్రజలు బంద్‌కు సహకరించడంలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మోసాల గురించి ప్రజలకు అర్దమైంది కాబట్టే వారు బంద్‌కు సహకరించడంలేదన్నారు. టీడీపీ నేతలే రోడ్లపై ఆందోళనలు చేస్తున్నారన్నారు. బస్‌ డిపోల వద్దకు వెళ్లి ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

చంద్రబాబు అరెస్ట్‌ అయి జేల్లో ఉన్నా టీడీపీ నేతలు ఇప్పటికీ పశ్చాత్తాపం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రజలు అమాయకులని భావిస్తున్నారన్న ఆయన.. మాజీ మంత్రులు మాత్రం చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదని, సీఎం జగన్‌ లండన్‌లో కూర్చొని కట్ర పూరిత రాజకీయాలు చేస్తున్నట్లు ఆరోపించడం ఏంటని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడానికి మాత్రమే విదేశాలకు వెళ్లారని, ఇక్కడి విషయాలు ఆయనకు ఎలా తెలుస్తాయని మంత్రి ప్రశ్నించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు