Breaking News: పునాది స్థాయి అక్షరాస్యతలో కేరళను అధిగమించిన ఏపీ పునాది స్థాయి అక్షరాస్యతలో ఏపీ కేరళను అధిగమించి అగ్రస్థానంలో నిలిచినందుకు సంతోషంగా ఉందని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. దేశంలోనే ఏపీ నెంబర్ వన్ గా నిలవడంతో జగన్ ప్రభుత్వం గర్విస్తోందని తెలిపారు. By Bhavana 06 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Minister Botsa: జాతీయ స్థాయిలో విద్య సౌలభ్యం సులభంగా అందించడంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఏపీ (AP)అగ్రస్థానంలో నిలిచిందని జాతీయ మీడియాలో వచ్చిన వార్తల గురించి ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అత్యధికులకు విద్యను అందుబాటులోకి తీసుకుని రావడంలో ఏపీ ఇప్పుడు కేరళను (Kerala) దాటేసిందని బొత్స అన్నారు. ఈ విషయంలో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ గా నిలవడం గురించి జగన్ ప్రభుత్వం గర్విస్తోందని తెలిపారు. ఈఏసీ-పీఎం విడుదల చేసిన ప్రాథమిక అక్షరాస్యత నివేదికలో ఏపీ 38.50 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, 36.55 శాతంతో కేరళ రెండో స్థానంలో నిలిచిందని బొత్స వివరించారు. అనుకున్నది సాధించాం.. డైనమిక్ నేత, దార్శనికుడు ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలో , ప్రభావవంతమైన పాలనలో అసాధ్యం అనుకున్నది కూడా సుసాధ్యం చేసి చూపించామని ఈ సందర్భంగా బొత్స పేర్కొన్నారు. కేవలం ఐదేళ్ల వ్యవధిలోనే ఏపీ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దామని బొత్స వివరించారు. అప్పుడు అడుగున..ఇప్పుడు అగ్రస్థానానా.. గత ప్రభుత్వ హయాంలో ఎంతో వెనుకబడి ఉన్న రాష్ట్రం ఇప్పుడు క్రమంగా అనేక రాష్ట్రాలను అధిగమిస్తూ అగ్రస్థానం వైపుగా ముందుకు దూసుకెళ్తోంది. పాఠశాల విద్యలో తీసుకువచ్చిన అనేక సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఫౌండేషన్ విద్య అందుబాటులో అంశంలో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. Also read: అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపన సమయంలోనే పిల్లల్ని కంటాం! #jagan #ap #kerala #botsa-satyanaryana #education-minister #foundation-literacy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి