Milk: పాలు ఎన్ని సార్లు మరిగించాలి? ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు మరిగిస్తే ఏమౌతుంది?

పాలను మరిగించే ప్రతిసారీ దానిలోని పోషకాలు నాశనం అవుతాయని గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి మాత్రమే పాలు మరిగించాలి. తప్పని పరిస్థితుల్లో పాలు చెడిపోతాయని అనిపిస్తే మరోసారి మరిగించవచ్చు. అంతకుమించి మరిగిస్తే పాలు తాగినా శరీరానికి కలిగే అన్ని ప్రయోజనాలు అందవు.

New Update
Milk: పాలు ఎన్ని సార్లు మరిగించాలి? ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు మరిగిస్తే ఏమౌతుంది?

Kitchen Tips: పాలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలిసిందే. మన ఎముకలు, శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి పాలు చాలా ముఖ్యమైనవి. ఇందులో ఉండే క్యాల్షియం, పోషకాలు శరీరాన్ని దృఢంగా ఉంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. దీన్ని మరిగించాలనికి సరైన మార్గం చాలామందికి తెలియదు. కొన్ని పొరపాటు వల్ల శరీరానికి పాలు పూర్తి ప్రయోజనం లభించక చాలాసార్లు పాలు కాచాల్సి వస్తుంది. చాలా మంది పాలను చిక్కగా చేయడానికి ఎక్కువసేపు మరిగిస్తారు. ఆ సమయంలో.. కొందరు వ్యక్తులు పదేపదే పాలు కాచడాన్ని తప్పు చేస్తారు. అంతేకాదు..కొందరు పాలు మరటం ప్రారంభించిన తర్వాత గ్యాస్‌ను నెమ్మదిగా పెట్టి ఎక్కువసేపు మరిగిస్తారు. పాలల్లో కాల్షియం, ప్రొటీన్లు, విటమిన్లు అనేక రకాల ఖనిజాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా ఇది శరీరానికి పోషణను అందిస్తుంది. పాలు తాగడం వల్ల శరీరం దృఢంగా ఉంటుంది. కానీ పాలు కాచేటప్పుడు కొన్ని తప్పులు చేస్తారు. ఇవి అస్సలు చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాలు ఎన్నిసార్లు మరిగించాలో తెలియని వారు ఎక్కువగానే ఉన్నారు. పాలను మరిగించడానికి సరైన మార్గం తెలియని వారికోసం ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

పాలు మరిగించే విధానం:

  • పాలను ఎక్కువ సేపు మరిగిచటం, లేదా పదే పదే మరిగించడం వల్ల పోషకాలు నాశనం అవుతాయని అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. దీని వల్ల శరీరానికి పాల వల్ల కలిగే అన్ని ప్రయోజనాలు అందవు. పాలను కాచడానికి సరైన విధానం ఏమిటంటే..పాలను మంట మీద ఉంచిన తర్వాత ఒక చెంచా, గరిటెతో నిరంతరం కదిలిస్తూ ఉండాలి. పాలు మరటం మొదలైనప్పుడు గ్యాస్‌ను ఆపివేయాలి. పాలు మరిగిన తర్వాత.. మళ్లీ మళ్లీ మరిగించడం తప్పు కాదు. పాలను మరిగించే ప్రతిసారీ దానిలోని పోషకాలు నాశనం అవుతాయని నిపుణులు అంటున్నారు. ఒక్కసారి మాత్రమే పాలు మరిగించాలి. పాలు చెడిపోతాయని అనిపిస్తే మరోసారి మరిగించవచ్చని చెబుతున్నారు.

ఈ విషయాలు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి:

  • ఆహారం తిన్న తర్వాత పాలు తాగితే వారు సగం కడుపుతో మాత్రమే పాలు తాగాలి. లేకపోతే జీర్ణక్రియ చెడిపోవచ్చని వైద్యులు అంటున్నారు. బెండకాయలు, ఉల్లిపాయలు తిన్నప్పుడు పాలు తాగవద్దు. ఎందుకంటే చర్మ వ్యాధులు వస్తాయి. చేపలు, నాన్‌వెజ్‌తో పాలు ఎప్పుడూ త్రాగవద్దు. ఇది చర్మంపై తెల్లటి మచ్చలు, ల్యూకోడెర్మాకు కారణం కావచ్చు. భోజనం చేసిన వెంటనే పాలు తాగకూడదు. ఇది కడుపులో భారం, జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.పాలతో ఉప్పు పదార్థాలకు దూరం ఉంటే మంచిదని ఆహార నిపుణులు చెబుతున్నారు

ఇది కూడా చదవండి: హార్ట్ బ్లాకేజ్ సంకేతాలు ఇవే.. ముందే గుర్తించకపోతే లైఫ్‌ డేంజర్‌లో పడినట్టే!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Horoscope: నేడు ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో  ఆనందంగా గడుపుతారు!

మకరరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఊహించని ఆర్థిక లాభాలు ఉంటాయి. వ్యాపార రంగంలో విపరీతమైన లాభాలు వస్తాయి.మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందంటే..

New Update
horoscope

horoscope

మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో తరచూ ఆటంకాలు నిరాశ కలిగిస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోకండి. మాటలు పొదుపుగా మాట్లాడాలి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అవసరం. ఖర్చులు పెరగవచ్చు.

Also Read: Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కొన్ని రోజులుగా వేధించిన ఆందోళన, ఒత్తిళ్లు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన దానికన్నా మెరుగైన ఫలితాలు అందుకుంటారు. కుటుంబసభ్యులు, స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. 

Also Read: Vontimitta Kodandarama Swamy Temple: హనుమంతుడి లేని రామాలయం..మన దగ్గరే..ఎన్నో ప్రత్యేకతలు!

మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో విఘ్నాలు చికాకు పెడతాయి. ప్రయత్నలోపం లేకుండా చూసుకోండి. గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు.

కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మనోబలంతో చేసే పనులు త్వరిత విజయాన్నిస్తాయి. ఆత్మవిశ్వాసంతో ఓ కీలక వ్యవహారంలో పురోగతి సాధిస్తారు. సమాజంలో మంచి గుర్తింపు, ఖ్యాతి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.

సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. బుద్ధిబలంతో పనిచేసి అందరి ప్రశంసలు అందుకుంటారు. పెట్టుబడుల ద్వారా ఆర్థిక లబ్ది చేకూరుతుంది. పెట్టుబడిదారులు గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు అందుకుంటారు. రుణభారం నుంచి ఉపశమనం పొందుతారు.

కన్యారాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో సత్వర విజయం ఉంటుంది. మీ ఖ్యాతి, ప్రజాదరణ అన్ని వైపుల నుంచి పెరుగుతుంది. డబ్బు రాక కూడా పెరుగుతున్న సంకేతాలున్నాయి. స్నేహితుల ద్వారా లబ్ధి పొందుతారు. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహా మేరకు నడుచుకుంటే మంచిది.

తులారాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. ధర్మసిద్ధి ఉంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో శ్రీఘ్ర విజయం ప్రాప్తిస్తుంది. బుద్ధి బలంతో క్లిష్టమైన పనులను కూడా చాలా ఈజీగా పూర్తి చేస్తారు. అవివాహితుల విషయంలో పెళ్లి చర్చలు జరగడానికి ఛాన్స్‌ ఉంది.

వృశ్చికరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. ముందుచూపుతో వ్యవహరిస్తే మంచిది. ఉద్యోగులు పని ఒత్తిడితో సతమతమవుతారు. వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. వ్యాపారులు ఆర్థిక లాభాలు అందుకుంటారు. ఒక శుభవార్త శక్తినిస్తుంది.

ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శుభ సమయం నడుస్తోంది. చేపట్టిన పనుల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. సమయస్ఫూర్తితో పనిచేసి కీలక వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. కొన్ని ఊహించని సంఘటనలు జరగవచ్చు. జీవిత భాగస్వామితో ఘర్షణలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. 

మకరరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఊహించని ఆర్థిక లాభాలు ఉంటాయి. వ్యాపార రంగంలో విపరీతమైన లాభాలు వస్తాయి. నిరంతర కృషి, పట్టుదలతో తిరుగులేని విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. 

కుంభరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో విజయాన్ని సాధిస్తారు. మీ పనితీరుకు, సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు సంతృప్తి, ఆనందాన్ని ఇస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావడం వల్ల ఈ రోజంతా ఆనందంగా గడుపుతారు.

మీనరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ప్రారంభించిన పనుల్లో సమస్యలు తలెత్తుతాయి. ప్రతి అడుగు ఆచి తూచి వేయాల్సి ఉంటుంది. బంధువులతో మనస్పర్థలకు అవకాశముంది. జీవిత భాగస్వామితో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. 

Also Read:WhatsApp new features: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

Also Read: Sri Rama Navami 2025: శ్రీరామ నవమి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఇదే

horoscope | Horoscope 2025 | horoscope-today | todays-horoscope | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment