Teeth Tips : దంతాల్లో రక్తం వస్తే అది దేనికి సంకేతం.. ప్రమాదకరం అవుతుందా..?

ప్రతీరోజూ బ్రష్ చేయడం వలన దంతాలను ఇన్ఫెక్షన్లతో పాటు ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. బ్రష్ చేస్తున్నప్పుడు దంతాల్లో రక్తం వస్తే వెంటనే అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దంతాల చుట్టూ చిగుళ్ళు, ఎముకలలో ఇన్ఫెక్షన్ కారణంగా దంతాలు కూడా రక్తస్రావం అవుతుంది.

New Update
Teeth Tips : దంతాల్లో రక్తం వస్తే అది దేనికి సంకేతం.. ప్రమాదకరం అవుతుందా..?

Teeth Tips : పళ్లు తోముకునేటప్పుడు(Brushing) రక్తం కారడం(Bleeding) మామూలు విషయం కాదంటున్నారు నిపుణులు. ఆ సమయంలో అజాగ్రత్తగా ఉండకుంటే కొన్ని ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందటున్నారు. దంతాలలో నొప్పిగా(Teeth Pain) అనిపించినా..!! బ్రష్ చేసేటప్పుడు రక్తస్రావం, ఏదైనా రకమైన వాపు వచ్చినా..? వెంటనే అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ప్రతీరోజూ బ్రష్ చేయడం, పళ్లు కడిగివేయడం వలన దంతాలను ఇన్ఫెక్షన్లతోపాటు ఆరోగ్యాన్ని కూడా మేలు జరుగుతుంది. వారం రోజుల పాటు రక్తస్రావం, వాపు, దంతాలు, చిగుళ్లలో నొప్పి వంటి సమస్యలు ఉంటే.. ఆలస్యం చేయకుండా దంతవైద్యుని(Dentist) వద్దకు వెళ్లాలని సూచిస్తున్నారు. ఇలాంటి లక్షణాలు ఉంటే ఎలాంటి వ్యాధులు వస్తాయో కొని విషయాలు తెలుసుకుందాం.

ఈ కారణంగా రక్తస్రావం అవుతుంది:

  • చిగుళ్ళలో రక్తస్రావం కావడానికి ఒకటి కంటే ఎక్కువ కారణాలు ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు కొన్నిసార్లు చిగుళ్ళలో వాపు ఉంటే బ్రష్ చేసేటప్పుడు రక్తస్రావం వస్తుంది. ఇది చిగుళ్ల వ్యాధికి ప్రారంభ లక్షణాలు కావచ్చు. చిగుళ్ల వ్యాధిని పీరియాంటల్ వ్యాధని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి వస్తే దంతాల చుట్టూ చిగుళ్ళు, ఎముకలలో ఇన్ఫెక్షన్ ఉంటుంది. దీని కారణంగా దంతాలు కూడా రక్తస్రావం అవుతుంది.

ఇలాంటి సమస్య ఉంటే ప్రమాదం:

  • యుక్త వయస్సు, గర్భధారణ, ఋతు సమయంలో స్త్రీలలో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. దీనికి ప్రధాన కారణం వారిలో హార్మోన్ల మార్పు(Hormonal Changes) లని నిపుణులు అంటున్నారు.ధూమపానం(Smoking), జన్యుశాస్త్రం, మధుమేహం మొదలైన వ్యాధులు ఉంటే ప్రమాదం ఎక్కువగా పెరుగుతుందటున్నారు. ఏదైనా రకమైన మందులు, నోటి క్యాన్సర్, డ్రగ్ థెరపీ(Drug Therapy)కి గురవుతై సమస్యలు పెరుగుతాయని అంటున్నారు. అయితే.. దంతాలు సురక్షితంగా ఉండాలంటే రోజూకు కనీసం 2, 3 సార్లు బ్రష్ చేయాలంటున్నారు. వీటితోపాటు ఆహారం సమతుల్యంగా తీసుకోవాటం, క్రమం తప్పకుండా దంతవైద్యుని వద్దకు వెళ్లి చెక్‌ చేసుకోవాలి. ధూమపానం, చూయింగ్‌గమ్ నమలడం మానుకుంటే దంతాలకు మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి : గర్భిణీలు ఎక్కువ నడిస్తే ఇబ్బందులు వస్తాయి.. ఈ భాగాల్లో నొప్పులకు అవకాశం!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: మధుమేహానికి సూపర్ రెమిడీ తెల్లధాన్యాలు..నేచురల్ ఇన్సులిన్ సప్లిమెంట్స్

Advertisment
Advertisment
తాజా కథనాలు