TS BJP: ఏ పార్టీతో పొత్తు పెట్టుకోము.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని తేల్చి చెప్పారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఈ నెల చివరి వారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటిస్తారని పేర్కొన్నారు. By V.J Reddy 15 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి T-BJP Chief Kishan Reddy: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై (Parliament Elections) ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోకుండా ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జనసేన పార్టీతో పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో పొత్తు పెట్టుకోమని చెప్పకనే చెప్పారు. ALSO READ: పెన్షన్ రూ.3,000కు పెంపు…రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికలకు రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎంత దూరమో, కాంగ్రెస్ పార్టీ కూడా తమకు అంతే దూరం అని పేర్కొన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఈ రెండు పార్టీలను అధిగమించి సీట్లు పొందుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల చివరి వారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటిస్తారని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికలపై కార్యాచరణ ఆ సమావేశంలో నిర్ణయం అవుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. వికసిత భారత్ సంకల్ప యాత్రలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఇతర పార్టీల ప్రజా ప్రతినిధులు పాల్గొన్న పాల్గొనకపోయిన బీజేపీ శ్రేణులు మాత్రం పాల్గొనాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ నుండి గెలిచిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తెలంగాణ వ్యాప్తంగా పర్యటన చేస్తారని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల పైన ఉమ్మడి పది జిల్లాల వారీగా రివ్యూ ఉంటుందని తెలిపారు. రాష్ట్ర స్థాయి నేత ఆ రివ్యూ లో పాల్గొంటారని పేర్కొన్నారు. వెంటనే పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం కావాలని తెలంగాణలోని బీజేపీ నేతలకు, కార్యకర్తలకు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. విశ్రాంతి తీసుకోవడానికి సమయం లేదని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో అన్ని స్థానాల్లో బీజేపీ గెలిచేలా పనిచేయాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ALSO READ: వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు! #telangana-news #bjp #kishan-reddy #parliament-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి