Telangana BJP First List: ఈ రోజే 40 మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్.. ఆ నేతలకు ఫ్యామిలీ ప్యాక్? తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ఈ రోజు రాత్రిలోగా విడుదలయ్యే అవకాశం ఉంది. కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జితేందర్ రెడ్డి, డీకే అరుణ తదితరులు తమతో పాటు తమ కుటుంబ సభ్యులకు కూడా టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. వీరి వినతికి హైకమాండ్ ఎలా స్పందిస్తుందనే అంశం ఆసక్తిగా మారింది. By Nikhil 19 Oct 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణ ఎన్నికలకు (Telangana Elections) సంబంధించి ఫస్ట్ లిస్ట్ ను విడుదల చేసేందుకు బీజేపీ (BJP) సిద్ధం అవుతోంది. దాదాపు 40 మంది అభ్యర్థులతో ఈ లిస్ట్ విడుదల కానుంది. ఈ మేరకు ఢిల్లీలో కిషన్ రెడ్డి (Kishan Reddy) నివాసంలో బీజేపీ నేతలు సమావేశమయ్యారు. ఎన్నికల కమిటీ మీటింగ్ కు ముందు నిర్వహిస్తోన్న ఈ కీలక సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ మీటింగ్ జరగనుంది. అనంతరం 40 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ విడుదల చేయనున్నారు. కాసేపట్లో జేపీ నడ్డాతో తెలంగాణ నేతలు భేటీ కానున్నారు. ఇది కూడా చదవండి: Pawan Kalyan: బీజేపీతో కలిసి పోటీ చేస్తారా లేదా మద్దతిచ్చి తప్పుకుంటారా.. పవన్ దారెటు.. ఇదిలా ఉంటే.. బీజేపీ టికెట్ల విషయంలోనూ ఫ్యామిలీ ప్యాకేజీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అనేక మంది ముఖ్య నేతలు తమతో పాటు తమ కుటుంబ సభ్యులకు కూడా టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తనకు అంబర్ పేట టికెట్ తో పాటు.. తన సతీమణి కావ్యారెడ్డికి ముషీరాబాద్ టికెట్ ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈటల రాజేందర్ హుజూరాబాద్ టికెట్ తో పాటు సతీమణి ఈటల జమునకు మేడ్చల్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. మరో కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు ఎల్బీ నగర్ టికెట్ ను, తన శ్రీమతికి మునుగోడు నుంచి టికెట్ ఇవ్వాలని పార్టీని కోరుతున్నారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తనకు మహబూబ్ నగర్ టికెట్ ఇవ్వడంతో పాటు తన కుమారుడు మిథున్ రెడ్డికి షాద్ నగర్ టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని ఇప్పటికే కోరినట్లు సమాచారం. మరో మాజీ మంత్రి డీకే అరుణ తనకు గద్వాల టికెట్ తో పాటు తన కుమార్తె స్నిగ్ధారెడ్డికి నారాయణపేట టికెట్ ఇవ్వాలని అడుగుతున్నారు. అయితే.. హైకమాండ్ వీరి వినతుల పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఆసక్తిగా మారింది. #bjp #telangana-elections-2023 #telangana-bjp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి