మధ్యప్రదేశ్ లో గెలుపు దిశగా బీజేపీ..ముఖ్యమంత్రి అభ్యర్ధిపై ఉత్కంఠత By Manogna alamuru 03 Dec 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తోంది. మొత్తం 230 స్థానాలకుగానూ 157 స్థానాలకు పైగా కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మళ్ళీ శివరాజ్ సింగ్ చౌహానేనా? ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించేందుకు శివరాజ్ చేసిన కృషిని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జాతీయ స్థాయి నాయకులతో సమన్వయం చేసుకుంటూ ప్రచారంలో దూసుకుపోయారు. 4 దశాబ్దాలుగా మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న శివరాజ్‌కే అధిష్ఠానం మళ్లీ పగ్గాలు అప్పగిస్తుందని అందరూ భావిస్తున్నారు. నాలుగుసార్లు సక్సెస్ ఫుల్ గా ముఖ్యమంత్రి పదవిని నిర్వర్తించిన శివరాజ్ సింగ్ చౌహాన్ కే సీనియర్ బీజేపీ నాయకులు కూడా సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఈయనకే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కైలాస్ విజయ్‌వర్గీయ బీజేపీ నేషనల్ జనరల్ సెక్రెటరీ కైలాస్ విజయ్ వర్గీయ కూడా సీఎం రేసులో ఉన్నారు. ఇండోర్ లో సీటు కేటాయించినప్పటి నుంచే తాను సీఎం రేసులో ఉన్నట్లు ఆయనే పలు సందర్భాల్లో పరోక్షంగా చెప్పారు. కేవలం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రజల ముందుకు రావడం లేదని, ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించినా నిర్వర్తించేందుకు సిద్ధమయ్యే వచ్చానని ప్రచార సభల్లో కైలాస్ చెప్పుకున్నారు. ఆ వ్యాఖ్యలతో పార్టీలో అంతర్గతంగా దుమారం కూడా రేగింది. దీంతో మళ్ళీ అధిష్ఠానమే ముఖ్యమంత్రిని నిర్ణయిస్తుందని, ఎలాంటి నిర్ణయం అయినా కట్టుబడి ఉంటానని చెప్పారు. ముఖ్యమంత్రి స్థానంలో తగిన వ్యక్తిని అధిష్టానం కూర్చోబెడుతుందని అన్నారు. జ్యోతిరాదిత్య సింధియా ఇదే ముఖ్యమంత్రి విషయంలోనే గొడవపడి కాంగ్రెస్ నుంచి వచ్చి బీజేపీలో చేరారు జ్యోతిరాదిత్య సింధియా. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి బీజేపీ ప్రభుత్వానికి ఏర్పాటుకు దోహదం చేశారు. అందుకే ఈసారి జ్యోతిరాదిత్య సింథియా ముఖ్యమంత్రి అవుతారని ఒక వర్గం ప్రచారం చేస్తోంది. అయితే ఇప్పటికే అక్కడ బీజేపీలో చాలా మంది సీనియర్లు ఉన్నారు. వారిని పక్కన పెట్టి ఇతనిని సీఎం చేస్తుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే రీసెంట్ గా శివరాజ్ సింగ్ పై కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో అధిష్ఠానం సింధియా వైపు మొగ్గు చూపే ఛాన్స్ ఉందని అంటున్నారు. తాజా ఎన్నికల్లో సింధియా పోటీచేయకపోవడం గమనార్హం. మరోవైపు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, ఫగ్గన్ సింగ్ కులస్థేలతో పాటు లోక్‌సభ ఎంపీలు రాకేశ్ సింగ్, గణేశ్ సింగ్, రితి పాఠక్, ఉదయ్ ప్రతాప్ సింగ్ తదితర జాతీయ స్థాయి నాయకులను కూడా బీజేపీ రంగంలోకి దించింది. వీళ్ళలో ఎవరో ఒకర్ని సీఎం పీఠంపై కూర్చోబెట్టే అవకాశముంది. #madhya-pradesh #cm #sivaraj-singh #jyothiraditya మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి