Raghunandan Rao: బీఆర్ఎస్ అక్రమాలపై యాక్షన్ ఎక్కడ? తెలంగాణ సర్కార్ ను ప్రశ్నించిన రఘునందన్ రావు గత ప్రభుత్వం చేసిన అక్రమాలపై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాణేనికి బొమ్మ బొరుసులాంటి పార్టీలు అని కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 30 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి BJP Raghunandan Rao: కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అడుగులు తడబడుతున్నాయన్నారు మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ప్రభుత్వ యాక్షన్ ఎందుకు మొదలు పెట్టడం లేదని ప్రశ్నించారు. సోమేష్ కుమార్ (Somesh Kumar) పై ఏసీబీ కేసు నమోదు చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తుందని నిలదీశారు. DOPT నిబంధనలకు వ్యతిరేకంగా సోమేష్ కుమార్ ఆస్తులు కూడగట్టినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. కారణం ఎంటి ? మహేందర్ రెడ్డి అంతు చూస్తా అన్న రేవంత్ రెడ్డి.. అతన్ని TSPSC చైర్మెన్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హీటిరో సంస్థకు ఇచ్చిన భూములు ఇల్లీగల్ అని తెలిసిన వాటిని ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు? ఒక్క బ్యూరోక్రట్ పై కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? కేసులు నమోదు చేయకపోవడం వెనక కారణం ఎంటి ? సోమేష్ కుమార్, అరవింద్ కుమార్, రజత్ కుమార్, వెంకట్ రాం రెడ్డి పై చర్యలు ఎవి ? బ్యూరో క్రట్లా బందిపొట్లా ? అని ప్రశ్నలు కురిపిస్తూ నిప్పులు చెరిగారు. Also Read: ఇమ్రాన్ ఖాన్‌కు అతి భారీ షాక్.. పదేళ్లు జైలుశిక్ష! రెండు పార్టీలు ఒకటే BRS, కాంగ్రెస్ నాణేనికి బొమ్మ బొరుసులాంటి పార్టీలు అని కామెంట్స్ చేశారు. కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల ను కేసీఆర్ (KCR) ఎన్నికల ముందు ప్రారంభించారని.. కొత్త ప్రభుత్వం వచ్చినా ఒక్క లబ్ధిదారుడికి కూడా ఇవ్వలేదని విమర్శలు చేశారు. చాలా మంది BRS ఎమ్మెల్యేల మీద కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారని అయితే వాటి పై విచారణ ఎందుకు చేయడం లేదు? ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్యూరో క్రట్ లపై కేసులు పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఎంటి ? అని ప్రశ్నించారు. మతి భ్రమించి.. తెలంగాణ వచ్చాక ప్రభుత్వ భూముల లెక్కల పై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎవరెవరికి భూములు కేటాయించారు ? ఎన్ని ఎకరాలు ప్రభుత్వ భూములను పంపిణీ చేశారు ? వివరాలు వెల్లడించాలన్నారు. అధికారం పోయాక మతి భ్రమించి కేటీఆర్ మాట్లాడుతున్నారని కామెంట్స్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ కు హంస, కాకి కి ఉన్న తేడా ఉందని అన్నారు. ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా BRS పార్టీకి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అల్టిమేట్ గా వచ్చేది సున్నానే అని ఎద్దేవ చేశారు. పక్క పార్టీలో తయారైన వాడిని లాక్కోవడమే BRS పని..BRS పార్టీ ఒక్క కార్యకర్తను కూడా తయారు చేసుకోలేకపోయిందని విమర్శలు గుప్పించారు. #brs #congress #raghunandan-rao #bjp-raghunandan-rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి