Hyderabad : కంటోన్మెంట్ ఉప ఎన్నిక పై బీజేపీ కసరత్తు హైదరాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంటోంది బీజేపీ. దీని కోసం కసరత్తులు మొదలుపెట్టింది. రేస్ గుర్రాలకే టికెట్లు ఇచ్చి ఈసారి ఎలా అయినా కంటోన్మెంట్ సీట్‌ను దక్కించుకోవాలని ప్లాన్ చేస్తోంది కమలం పార్టీ. By Manogna alamuru 10 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి BJP Cantonment Candidate: హైదరాబాద్(Hyderabad) కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత హఠాత్మరణంతో ఆ సీటు ఖాళీ అయింది. ఇక్కడి సీటు కోసం ఉప ఎన్నికల నిర్వహించున్నారు. దీని కోసం తెలంగానలో పార్టీలు రెడీ అవుతున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్ర బీజేపీ(BJP) కూడా కసరత్తులు మొదలుపెట్టింది. ఈ టికెట్‌పను రేస్ గుర్రాలకే ఇస్తే బావుంటుందని ఆలోచిస్తున్నారు బీజేపీ పెద్దలు. ఇప్పటికే కంటోన్మెంట్ అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) లు ఒక కొలిక్కి వచ్చేశాయి. దీంతో ఇప్పుడు బీజేపీ కంటోన్మెంట్ మీద గురి పెట్టింది. సీనియర్లకే టికెట్.. గత అసెంబ్లీ ఎన్నిక(Assembly Elections) ల్లో రెండవ స్థానంలో నిలిచిన బీజేపీ... ఎలా అయినా ఈసారి కంటోన్మెంట్ స్థానాన్ని దక్కించుకోవాలని ధృఢ నిశ్చయంతో ఉంది. కొత్తగా వచ్చిన వారికి కాకుండా పార్టీ లో ఉన్న నేతలకే టికెట్ ఇవ్వాలంటూ కమలం నేతలు కూడా డియాండ్ చేస్తున్నారు. ఈ టికెట్ కోసం ఎస్సీ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొప్పు బాషా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. తనకున్న అనుకూలతలను పార్టీకి ఇప్పటికే వివరించినట్టు సమాచారం. ప్రస్తుతం కొప్పు బాషా భార్య సుకన్య ఇబ్రహీంపట్నం ఎంపీపీగా ఉన్నారు. ఏబీవీపీ పుట్టిన దగ్గర నుంచి కొప్పు బాషా బీజేపీలోనే ఉన్నారు. ఈ అర్హతలతోనే కంటోన్మెంట్ సీటు తనకు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. పోటీలో చాలామంది... మరోవైపు కంటోన్మెంట్ టిక్కెట్ రేసులో మాజీ మంత్రి శంకర్రావు కుమార్తె సుస్మిత కూడా పోటీ పడుతున్నారు. గతంలో టికెట్ ఆశించి గ్రౌండ్‌వర్క్ చేసుకున్నారు సుస్మిత(Sushmita). ఇప్పుడు కూడా అదే తనకు ఉపయోగపడుతుందని ఆమె అంటున్నారు. ఇక టిక్కెట్ రేసులో మాజీ ఎంపీ వర్రి తులసీరాం కుమారుడు విజయ్ కుమార్, మాజీ మేయర్ శ్యాంరావు మనువడు సందీప్, మాజీ మంత్రి సదాలక్ష్మి కుమారుడు వంశీ తిలక్‌లు కూడా ఉన్నారు. వీరిలో ఎవరికి టికెట్ ఇవ్వాలనే దానిపై ముమ్మరంగా కసరత్తులు చేస్తోంది. బలాబలాల మీద లెక్కలు వస్తోంది బీజేపీ అధిష్టానం. Also Read : Supreme Court: కేజ్రీవాల్‌కు మళ్ళీ ఎదురుదెబ్బ #hyderabad #bjp #by-elections #cantonment మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి