JP Naddda: ఇండియా కూటమి కథ ముగిసింది.. జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు దేశంలో ఇండియా కూటమి పని అయిపోయిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కూటమి పూర్తి స్థాయిలో ఏర్పడక ముందే.. కుప్పకూలిపోయినట్లు ఎద్దేవా చేశారు. అందులో ఉన్న నేతలు తమ అక్రమ ఆస్తులు కాపాడుకోవడానికి ఇండియా కూటమి పెట్టారంటూ విమర్శలు చేశారు. By B Aravind 28 Jan 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి లోక్‌సభ ఎన్నికలు దగ్గరకొస్తున్నాయి. బీజేపీని కేంద్రంలో నుంచి గద్దె దించేందుకు ఇండియా కూటమి వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన ఇండియా కూటమి పని అయిపోయిందని వ్యాఖ్యానించారు. కూటమి పూర్తి స్థాయిలో ఏర్పడక ముందే.. కుప్పకూలిపోయినట్లు ఎద్దేవా చేశారు. ఇండియా కూటమిలో ఉన్న నేతలు కేవలం తమ అక్రమ ఆస్తులు కాపాడుకోవడానికి ఇండియా కూటమి పెట్టారంటూ విమర్శలు చేశారు. న్యాయ్ కాదు అన్యాయ్ యాత్ర మరోవైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో న్యాయ యాత్ర కూడా విఫలమైందని అన్నారు. రాహుల్ గాంధీ చేస్తోంది న్యాయ్ యాత్ర కాదని.. అది అన్యాయ్ యాత్ర అంటూ జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. అయితే తాజాగా బిహార్‌లోని నితీష్ కుమార్ ఇండియా కూటమి నుంచి వీడి బీజేపీతో జత కట్టి.. తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. Also Read: 2024లో జేడీయూ ఖతం.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు కీలక నేతలు కూటమి నుంచి ఔట్ అలాగే ఇటీవల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా తమ రాష్ట్రంలో ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కూడా పంజాబ్, ఢిల్లీలో ఒంటరిగా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ప్రకటన చేశారు. కీలక నేతలు ఇండియా కూటమి నుంచి వెళ్లిపోవడంతో.. ఈ కూటమికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం ఈ కూటమిలో కాంగ్రెస్, తమిళనాడు నుంచి డీఎంకే, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పార్టీ, ఉత్తరప్రదేశ్ నుంచి అఖిలేష్ యాదవ్ పార్టీలు మాత్రమే మిగిలాయి. మిగతావి చిన్న చిన్న పార్టీలు మాత్రమే ఉన్నాయి. అయితే 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు కేంద్రంలో ఎవరికి అధికారం అప్పగిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే. Also Read: బీహార్‌లో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం..ఏ అవకాశాన్ని వదలబోమన్న ప్రధాని మోదీ..!! #national-news #india-alliance #jp-nadda మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి