BJP MP Bandi Sanjay Sensational Comments: పవన్ ను అడ్డుకోవడం దారుణమైన చర్య.. బండి సంజయ్ హాట్ కామెంట్స్

పవన్ ను అడ్డుకోవడం దారుణమైన చర్య అని కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. సోమవారం ఓటర్ చేతన్ మహాభియాన్ కార్యక్రమంలో వర్చువల్ గా ప్రసంగించిన బండి సంజయ్.. ఏపీ ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు. మద్యాన్ని నిషేధిస్తామని హామీలు ఇచ్చి మద్యం బాండ్లు రిలీజ్ చేస్తారా? అని ప్రశ్నించారు. తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పు చేస్తోన్న ఏకైక సర్కార్ జగన్ దే అని ఆరోపించారు. అవినీతిలో, అప్పుల్లో, అరాచకాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని విమర్శించారు. దొంగ ఓట్లతో మళ్లీ గెలిచేందుకు ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందంటూ దుయ్యబట్టారు బండి సంజయ్.

New Update
Telangana: సీఎంగారు ఇదేం పని.. రేవంత్‌ రెడ్డికి బండి సంజయ్ సంచలన లేఖ..!

BJP MP Bandi Sanjay Sensational Comments on AP Government: పవన్ ను అడ్డుకోవడం దారుణమైన చర్య అని కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. సోమవారం ఓటర్ చేతన్ మహాభియాన్ కార్యక్రమంలో వర్చువల్ గా ప్రసంగించిన బండి సంజయ్.. ఏపీ ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు. మద్యాన్ని నిషేధిస్తామని హామీలు ఇచ్చి మద్యం బాండ్లు రిలీజ్ చేస్తారా? అని ప్రశ్నించారు. తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పు చేస్తోన్న ఏకైక సర్కార్ జగన్ దే అని ఆరోపించారు. అవినీతిలో, అప్పుల్లో, అరాచకాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని విమర్శించారు. దొంగ ఓట్లతో మళ్లీ గెలిచేందుకు ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందంటూ దుయ్యబట్టారు బండి సంజయ్.

ఏపీలో అంతో ఇంతో ప్రజలకు మేలు జరుగుతోందంటే.. అది కేంద్రం ఇస్తున్న నిధులే కారణమని చెప్పారు. బీజేపీని హేళన చేసిన పార్టీలే నామ రూపాల్లేకుండా పోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంపై నమ్మకంతోనే పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో చేరారని అన్నారు బండి. పవన్ ప్రజాభిమానం ఉన్న నేత అని, ప్రజా సమస్యలపై జనంలోకి వెళ్తుంటే అడ్డుకోవడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. ఆనాడు దొంగ పాదయాత్రలతో జగన్ అధికారంలోకి వచ్చారు. కానీ, ఇవాళ నిజమైన పాదయాత్రలతో ప్రజలకు దగ్గరవుతున్న ప్రతిపక్ష పార్టీలను అడ్డుకుంటూ పాదయాత్రలను అపే కుట్ర చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు.

డ్రగ్స్, గంజాయి, మద్యం, భూకబ్జాల దందాలతో రెండు రాష్ట్రాల్లో దోపిడీ జరుగుతుందన్నారు బండి సంజయ్‌. ఆంధ్రప్రదేశ్ లో అవినీతి, అరాచక ప్రభుత్వం రాజ్యమేలుతోందన్నారు. ఏపీలో వైసీపీని కూకటి వేళ్లతో పెకిలించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ సారి వైసీపీ అధికారంలోకొచ్చే అవకాశం లేదని ప్రజల్లో భావన నెలకొంది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 10 వేల ఓట్లకుపైగా నకిలీ ఓట్లను నమోదు చేసే పనిలో నిమగ్నమయ్యారని.. కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఈ విషయంపై చాలా సీరియస్ గా ఉందన్నారు.

వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అడ్డదారులు తొక్కుతోందన్నారు. రెండు రాష్ట్రాలు విడిపోయాయి.. మన మధ్య మనస్పర్థల్లేవ్.. అందరం బాగుండాలని అనుకుంటున్నామన్నారు. కానీ ఏపీ, తెలంగాణ సీఎంలు మాత్రం దాగుడు మూతలు ఆడుకుంటున్నారని దుయ్యబట్టారు. మళ్లీ అధికారంలోకి రావడానికి.. మళ్లీ ప్రాంతీయ విద్వేషాలు రగిలించేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్.

Advertisment
Advertisment
తాజా కథనాలు