/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/gun-jpg.webp)
Bjp Mla: పోలీసు స్టేషన్ (Police Station) లో తన కుమారుడి మీద దాడికి యత్నించిన వారి నుంచి తన కుమారుడ్ని , తనను రక్షించుకోవడం కోసమే నేను శివసేన నాయకుడి పై కాల్పులు జరిపాను అంటున్నాడు మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే(Bjp Mla) గణపత్ గైక్వాడ్. కేవలం ఈ కాల్పులు (Gun Shoot) ఆత్మరక్షణ కోసమే చేసినట్లు ఆయన వివరించారు. ఈ విషయం గురించి బాధపడాల్సిన అవసరం ఏం లేదని ఆయన వివరించారు.
మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే (Eknadh Shindey) శివసేన వర్గానికి చెందిన నేత పై బీజేపీ ఎమ్మెల్యే శుక్రవారం కాల్పులు జరిపారు. ద్వార్లీ గ్రామంలోని ఓ భూవివాదం పై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి గణపతి గైక్వాడ్ , ఆయన కొడుకు వైభవ్ గైక్వాడ్ పోలీసు స్టేషన్ కు వచ్చారు. ఆ సమయంలోనే మహేశ్ గైక్వాడ్ రాహుల్ పాటిల్ తో పాటు ఇతర కార్యకర్తలు పోలీస్ స్టేషన్ కు వచ్చారు.
ఇరువురి నేతలను కూర్చొని మాట్లాడుకోవాలని సూచించారు. ఆ సమయంలోనే బయట నేతలు ఆందోళనకు దిగారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు బయటకు వెళ్లారు. ఆ సమయంలో ఒక్కసారిగా గణపతి గైక్వాడ్ తుపాకీతో కాల్పులు ప్రారంభించారు. గణపతి ..మహేష్ గైక్వాడ్ , మరో నేత రాహుల్ పాటిల్ పై తుపాకీతో ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ కాల్పుల్లో మహేష్ గైక్వాడ్, రాహుల్ తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరుపుతున్న సమయంలో గణపతి గైక్వాడ్ చేతికి తీవ్రంగా గాయం అయ్యింది. దీంతో మహేష్ గైక్వాడ్, రాహుల్ ను థానే లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మహేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
బీజేపీ ఎమ్మెల్యే గణపతి గైక్వాడ్ తో పాటు మరో ఇద్దరిని పోలీసు అధికారులు అదుపులోనికి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటన గురించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో ఠాక్రే వర్గం దుమ్మెత్తిపోస్తుంది.
పోలీసు స్టేషన్ లోనే బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు జరిపాడు అంటే..వాళ్లకు చట్టం అన్న , పోలీసులు అన్న భయం లేదని అర్థం చేసుకోవాలని అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఫెయిలైందని మండిపడ్డారు.
Also read: అమెరికాకు హమాస్ వార్నింగ్…త్వరలోనే ప్రతిఫలం ఉంటుంది!