TDP-Janasena-BJP: అనపర్తి టీడీపీకే..రఘురామకు క్లీయరైన లైన్‌!

అనపర్తి అసెంబ్లీ సీటును టీడీపీకి ఇచ్చేసేందుకు బీజేపీ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం. బదులుగా అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె సీటును బీజేపీ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

New Update
TDP-Janasena-BJP: అనపర్తి టీడీపీకే..రఘురామకు క్లీయరైన లైన్‌!

AP: ఏపీ రాజకీయాల్లో జనసేన-టీడీపీ- బీజేపీ పొత్తుల వల్ల కొన్ని చోట్ల సీట్ల విషయంలో నాయకుల మధ్య విభేధాలు రావడంతో పార్టీ పెద్దలకు తలనొప్పి మొదలైంది. పొత్తుల్లో భాగంగా కొన్ని ముఖ్యమైన స్థానాలను టీడీపీ వదులుకోవాల్సి వచ్చింది. దీంతో ముఖ్య నేతలకు నిరాశ తప్పలేదు. ఇలాంటి వారిలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఒకరు. టీడీపీ ఫస్ట్‌ జాబితాలో ఆయనకు సీటు ఇచ్చినప్పటికీ... పొత్తు తర్వాత ఆ స్థానం బీజేపీకి వెళ్లిపోయింది.

దీంతో స్థానిక టీడీపీ నేతలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రామకృష్ణారెడ్డినే అనపర్తిలో కొనసాగించాలని పట్టుబట్టడంతో చంద్రబాబు పునరాలోచనలో పడ్డారు. దీనిపై జనసేన, బీజేపీ నేతలతో చర్చించారు. ఈ నేపథ్యంలో అనపర్తి అసెంబ్లీ సీటును టీడీపీకి ఇచ్చేసేందుకు బీజేపీ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం. బదులుగా అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె సీటును బీజేపీ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కూటమిలో పార్టీలకు కేటాయించిన సీట్లలో చేయాల్సిన ఒకటి రెండు మార్పులపై టీడీపీ, జనసేన, బీజేపీ అగ్రనేతలు శుక్రవారం చర్చించారు. ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో సుమారు రెండు గంటలపాటు ఈ భేటీ జరిగింది. ఇందులో జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌, సిద్ధార్థనాథ్‌ సింగ్‌‌లు పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు మూడు పార్టీలూ ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం వాటిలో కొన్ని మార్పులపై తాజా సమావేశంలో చర్చించారు. అనపర్తి స్థానం మార్పుతో పాటు, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఎక్కడి నుంచి పోటీ చేయించాలన్న అంశంపైనా చర్చ జరుగుతుంది. అనపర్తిలో రామకృష్ణారెడ్డినే కొనసాగించాలని గట్టిగా డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో టీడీపీ విజ్ఞప్తి మేరకు.. ఆ సీటు వదులుకోడానికి బీజేపీ సిద్ధమైంది. దానికి బదులుగా ఉంగుటూరు తమకు కేటాయించాలని ఆ పార్టీ నేతలు విజ్ఙప్తి చేశారు. కానీ, ఇప్పటికే జనసేనకు ఆ సీటును కేటాయించినందున ఇవ్వలేమని చంద్రబాబు స్పష్టం చేశారు.

Also read: ఓటు నమోదుకు మరో మూడు రోజులే గడువు..త్వరపడండి!

Advertisment
Advertisment
తాజా కథనాలు