Telangana: పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..

గత కొంతకాలంగా పార్టీ మారుతారంటూ వస్తున్న వార్తలపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ఇంతకాలం ఈ అంశంపై మౌనం వహిస్తూ వచ్చిన రాజగోపాల్ రెడ్డి.. ఇప్పుడు తన మౌనాన్ని వీడారు. పార్టీ మార్పు అంశంపై క్లారిటీ ఇచ్చారు.

New Update
Telangana: పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..

Komatireddy Raj Gopal Reddy: గత కొంతకాలంగా పార్టీ మారుతారంటూ వస్తున్న వార్తలపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ఇంతకాలం ఈ అంశంపై మౌనం వహిస్తూ వచ్చిన రాజగోపాల్ రెడ్డి.. ఇప్పుడు తన మౌనాన్ని వీడారు. పార్టీ మార్పు అంశంపై క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తనపై వస్తున్నట్లు వార్తలను ఖండిస్తున్నానని ప్రకటించారు. తాను వ్యక్తిగత సిద్ధాంతాలను మార్చే వ్యక్తిని కాదని అన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

రాజగోపాల్ రెడ్డి ప్రకటన ప్రకారం..

'నేను భారతీయ జనతా పార్టీ నుండి ఇతర పార్టీల్లోకి వెళుతున్నానంటూ కొన్ని పత్రికలు, మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను పూర్తిగా ఖండిస్తున్నాను. నేను వ్యక్తిగత స్వార్థం కోసం సిద్ధాంతాలను మార్చే వ్యక్తిని కాదు. నా చుట్టూరా ఉన్న సమాజానికి నా వంతు మంచి చేయాలన్న లక్ష్యంతోనే రాజకీయ మార్గాన్ని ఎంచుకున్న వ్యక్తిని. ఆ దిశగానే ఎంపీగా, ఎంఎల్సీగా, ఎంఎలిగా ఎక్కడా అవినీతి, వ్యక్తిగత స్వార్ధం లేకుండా నీతి నిజాయితీగా పనిచేస్తూ వచ్చాను. ఆ దిశగానే ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు కోసం ఆనాడు నా ఎంపీ పదవికి రాజీనామా చేసి స్వరాష్ట్ర సాధనలో నా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాను. కానీ పద్నాలుగు వందల మంది యువకుల బలిదానాలు, వేలాది యువజన, కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలతో పాటు సబ్బండ వర్గాల ఒక్కటై తెచ్చుకున్న తెలంగాణాలో తర్వాత రాజకీయ పరిణామాలు నన్నెంతో కలిచివేశారు. ప్రజా తెలంగాణా బదులు ఒక్క కుటుంబం కోసమే తెలంగాణా అన్నట్లు పరిస్థితి తయారైంది. కేసీఆర్ ప్రజా పాలకుని వలా కాక, తెలంగాణాకు నిజాం రాజు వలే నియంతృత్వ పోకడలుపోతున్నారు. తెలంగాణా బరిస్తుంది.. కానీ అవమానాలను బరించదు..ఆత్మగౌరవం కోసం ఎందాకైనా జెండా ఎత్తిపడుతుందన్న విషయం ఇప్పటికే అనేక విషయాల్లో వెల్లడైంది. అందుకే తెలంగాణాలో ప్రజారాజ్యం ఏర్పాటు దిశగానే నేను గడిచిన సంవత్సరం కాంగ్రెస్ పార్టీతో పాటు నా ఎంఎల్ఎ పదవికి సైతం రాజీనామా చేసి బీజేపీలో చేరాను. ఈ దేశాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు నడిపించే శక్తి ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమితాలకు ఉందని విశ్వసించి దేశ సౌభాగ్యంలో నేను భాగస్వాములు కావాలని అడుగు వేశాను. మునుగోడులో కేసీఆర్ ఆయన 100 మంది ఎంఎల్ఎలు మునుగోడులో సంసారాలు పెట్టినా.. నా మీద, బీజేపీ మీద మునుగోడు ప్రజలు ఆచంచల విశ్వాసాన్నే చూపారు. కేసీఆర్ ఆయన అవినీతిని కక్కించి కుటుంబ తెలంగాణా బదులు ప్రజాస్వామిక,బహుజన తెలంగాణా ఏర్పాటు చేసే సత్తా ఒక్క బీజేపీకే ఉంది. నేనే కాదు ఇతర ముఖ్య నాయకులెవరూ బీజేపీని వీడరు. కేసీఆర్ కుటుంబ పాలనను అంతమొందించే దిశగా భారతీయ జనతా పార్టీ సైనికులై ముందుకు కదులుతున్నాము.' అంటూ రాజగోపాల్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు.

Also Read:

‘ఆ విషయంలో కేసీఆర్‌కు ఆస్కార్, నోబెల్ అవార్డ్ ఇవ్వొచ్చు’

Advertisment
Advertisment
తాజా కథనాలు