Tspsc : గ్రూప్-1 పరీక్ష రద్దు.. కిషన్‌రెడ్డి, ఈటలతో పాటు ఇతర నేతల రియాక్షన్ ఇదే! తెలంగాణలో పరీక్షల రద్దు అంశం మళ్లీ తెరమీదకొచ్చింది. రాష్ట్రంలో ఎంతో ప్రతీష్టాత్మకంగా నిర్వహించిన టీఎస్పీఎస్సీ గ్రూప్-1 పరీక్ష మళ్లీ రద్దు అయింది. తాజాగా దీనికి సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. By Vijaya Nimma 23 Sep 2023 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి గ్రూప్-1 పరీక్షలు మళ్లీ వాయిదా పడటంపై కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి గారి ప్రకటన చేశారు. కేసీఆర్ ప్రభుత్వ అసమర్థ ప్రజాపాలన, సరైన నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యం కారణంగా.. వరుసగా రెండోసారి రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు వాయిదా పడటం దురదృష్టకరం అన్నారు. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న 4 లక్షల మంది యువతలో నైరాశ్యం నింపేలా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో.. నీళ్లు, నిధుల విషయంలో ఎలాగూ దగాపడుతున్నాం. ఇప్పుడు నియామకాల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం యువతకు శాపంగా మారిందన్నారు. ఇటీవలే జరిగిన పేపర్ లీక్ ఘటన ఈ సందర్భంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం కాస్తయినా జాగ్రత్తగా వ్యవహరిస్తోందనుకుంటే.. మళ్లీ అదే అసమర్థత, అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని మండిపడ్డారు. సర్కార్ నిర్లక్ష్యాన్ని హైకోర్టు దృష్టికి గ్రూప్-1 పరీక్షలో..అక్రమాలను అరికట్టేందుకు దరఖాస్తుదారుల బయోమెట్రిక్ తీసుకోవడం తప్పనిసరి అంటూ.. నియామక నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ.. ఆ తర్వాత బయోమోట్రిక్ తప్పనిసరి కాదంటూ వ్యవహరించడం.. యువతకు న్యాయబద్ధంగా ఉద్యోగాలు కల్పించే విషయంలో బీఆర్ఎస్ సర్కార్ ఆలోచన సరళిని స్పష్టంచేస్తోందన్నారు. దరఖాస్తులు మొదలుకుని ప్రతి అంశంలోనూ నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోంది. హాల్‌టికెట్లపై ఫొటోలు లేకపోవడం, బయోమెట్రిక్ స్క్రీనింగ్‌ను తొలగించడం ద్వారా పరీక్షల్లో అక్రమాలకు ఆస్కారం కల్పించినట్లయింది. ఇలా గ్రూప్-1 పరీక్షల నిర్వహణ విషయంలో సర్కార్ నిర్లక్ష్యాన్ని కొందరు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో.. పరీక్షలను రద్దుచేయడం మినహా న్యాయస్థానం ముందు వేరే అవకాశమే లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో యువత భవిష్యత్తుకు భద్రత, భరోసా కల్పించలేని కేసీఆర్ ప్రభుత్వానికి అధికారంలో ఉండే నైతిక అర్హత లేదన్నారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో స్విగ్గి డెలివరీ బాయ్ మృతి.. అసలేం జరిగిందంటే..? రాజీనామా చేయాలి Tspsc గ్రూప్ వన్ పరీక్ష రద్దుపై ఈటల రాజేందర్ స్పందించారు. కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టి లాంటిదన్నారు. ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలి..? అని అన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుందని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం పుట్టిందే ఉద్యోగాల కోసం.1952లో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమంలో ఏడు మంది మరణించారు.!, 1969 ఉద్యమంలో 369 మంది చనిపోయారు..! మలిదశ ఉద్యమంలో కూడా అనేక మంది అమరులయ్యారు. తెలంగాణ వచ్చిన తర్వాత కాంట్రాక్టు ఉద్యోగులను, ఔవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని.. కొత్త ఉద్యోగాలు నింపుతామని.. ప్రైవేట్‌లో ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఒకటి నెరవేర్చలేదన్నారు. టీఎస్పీఎస్సీ ఉద్యోగుల భర్తీ కోసం నోటిఫికేషన్లు వేస్తే 17 పేపర్లు లీక్ చేసి వారి నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నారని ఈటల ఆరోపించారు. టీఎస్పీఎస్సీ గ్రూప్-1 పరీక్ష రద్దు చేయడం ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ మేల్కొని పాలనపై దృష్టి పెట్టాలని కితబు పలికారు. ఎన్నికల్లో పైసలు, మద్యం పంచుడు ఇవన్నీ కాదు.. కేసీఆర్ వచ్చిన తర్వాత ఒరగట్టింది ఏమీ లేదన్నారు. టీఎస్సీఎస్సీ గ్రూప్-1 పరీక్ష రద్దుకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ గ్రూప్ - వన్ నోటిఫికేషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బల్మూరి వెంకట్ స్పందించారు. తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్‌లో జరిగిన అవకతవకలను తప్పు పడుతూ బయోమెట్రిక్ విధానం అమలు చేయించడంలో విఫలం అయ్యారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ తెలంగాణ ప్రభుత్వ తప్పిదమే అని బల్మూరి ఆరోపించారు. ప్రతిఒక్క అభ్యర్థికి లక్ష రూపాయలు ఇవ్వాలని ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వచ్చే ఎన్నికల తరువాత గెలిచి యువత సమస్యలను పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. యువతకు న్యాయం జరిగేలా సహాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు బల్మూరి. #hyderabad #kishan-reddy #tspsc #group-1-exam #cancellation #eeta #other-leaders-reaction మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి