BRS Party: బీజేపీకి మరో బిగ్ షాక్.. బీఆర్ఎస్ లో చేరిన దరువు ఎల్లన్న

మనకొండూరు టికెట్ దక్కకపోవడంతో బీజేపీపై ఆగ్రహంగా ఉన్న తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు దరువు ఎల్లన్న ఈ రోజు బీఆర్ఎస్ లో చేరారు. కేటీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు.

New Update
BRS Party: బీజేపీకి మరో బిగ్ షాక్.. బీఆర్ఎస్ లో చేరిన దరువు ఎల్లన్న

తెలంగాణలో బీజేపీకి మరో షాక్ తగిలింది. తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు దరువు ఎల్లన్న ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఈ రోజు ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేసిన దరువు ఎల్లన్న రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే.. గత ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదన్న కారణంతో ఆ పార్టీకి దూరమయ్యారు. అనంతరం బీజేపీలో చేరి క్రియాశీలకంగా పని చేశారు. బండి సంజయ్ పాదయాత్రలో యాక్టీవ్ గా పాల్గొన్నారు. తన పాటలతో కేసీఆర్ సర్కార్ పై పోరాటం చేశారు. మానకొండూరు నుంచి ఆయన బీజేపీ టికెట్ ఆశించారు. కానీ అనూహ్యంగా ఆరేపల్లి మోహన్ కు బీజేపీ టికెట్ కేటాయించడంతో ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బీఆర్ఎస్ లో చేరారు.

పార్టీకి దూరమైన ఉద్యమకారులను బీఆర్ఎస్ పార్టీ మళ్లీ దగ్గరకు చేర్చుకుంటోంది. ఈ నేపథ్యంలో ఏపూరి సోమన్న. చెరుకు సుధాకర్, జిట్టా బాలకృష్ణారెడ్డిని ఆహ్వానించగా వారు గులాబీ కండువా కప్పుకున్నారు. తాజాగా దరువు ఎలన్న కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఇతర పార్టీల్లో టికెట్లు దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న వారిని పార్టీలో చేర్చుకోవడంలో బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

పొన్నాల లక్ష్మయ్య, నాగం జనార్దన్ రెడ్డి, విష్ణువర్దన్ రెడ్డిని కేటీఆర్ స్వయంగా ఇంటికి వెళ్లి ఆహ్వానించారు. మల్కాజ్ గిరి కాంగ్రెస్ అసంతృప్త నేత నందికంటి శ్రీధర్ ను ఎన్నికల షెడ్యూల్ కన్నా ముందే చేర్చుకుని కార్పొరేషన్ పదవిని సైతం ఇచ్చేశారు. రానున్న రోజుల్లో ఈ చేరికలు మరిన్ని ఉంటాయని గులాబీ నేతలు చెబుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు