Lok Sabha Elections 2024 : బీజేపీ మొరాదాబాద్ ఎంపీ అభ్యర్థి కున్వర్ సర్వేష్ కుమార్ కన్నుమూత..!

యూపీలోని మొరాదాబాద్ బీజేపీ అభ్యర్థి కున్వర్ సర్వేష్ కుమార్ అనారోగ్యంతో శనివారం మరణించారు. ఆయన వయస్సు 72 సంవత్సరాలు.కున్వర్ సర్వేష్ సింగ్ 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు.

New Update
Lok Sabha Elections 2024 : బీజేపీ మొరాదాబాద్ ఎంపీ అభ్యర్థి  కున్వర్ సర్వేష్ కుమార్ కన్నుమూత..!

BJP :  యూపీ(UP) లోని మొరాదాబాద్ బీజేపీ అభ్యర్థి కున్వర్ సర్వేశ్ సింగ్(Kunwar Sarvesh Singh) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ(Delhi) లోని ఎయిమ్స్ చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు. శుక్రవారం (ఏప్రిల్ 19) మొరాదాబాద్‌లో లోక్‌సభ ఎన్నిక(Lok Sabha Elections) ల పోలింగ్ జరగడం గమనార్హం. అనారోగ్యం కారణంగా ఎన్నికల సమయంలో కూడా ప్రచారానికి దూరంగా ఉన్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు.

తొలిసారిగా 1991లో ఠాకూర్ ద్వారా అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. అప్పటి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో లోకసభ ఎన్నికల్లో విజయం సాధించారు. అప్పటి నుంచి జాతీయ రాజకీయాల్లోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి ఎస్టీ హసన్ చేతిలో ఓడిపోయాడు. ఠాకూర్ సామాజిక వర్గానికి చెందిన ఆయన.. యూపీ రాజకీయ నేతల్లో ఒకరు. ఆయన కుమారుడు కున్వర్ సుశాంత్ సింగ్.. మొరాదాబాద్ లోకసభ స్థానం పరిధిలోని బాధాపూర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.

ఇది కూడా చదవండి: రేపు హైదరాబాద్ లో మటన్ చికెన్ షాప్స్ బంద్.. రీజన్ ఇదే

Advertisment
Advertisment
తాజా కథనాలు