లోక్‌సభలో అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జై భీం, జై తెలంగాణతోపాటు జై పాలస్తీనా నినాదం చేయడంపై అధికారపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసద్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్ తెలిపారు.
Asaduddin Owaisi: లోక్‌సభలో అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణస్వీకారంపై దుమారం రేగుతోంది. మంగళవారం ప్రమాణస్వీకారం చేసిన అసదుద్దీన్ చివర్లో జై భీం, జై తెలంగాణ, జై పాలస్తీనా అంటూ ఒక్కసారిగా సభ ప్రాంగాణంలో ప్రకంపణలు సృష్టించాడు. దీంతో అధికారపక్ష సభ్యులు అసరుద్దీన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసద్ ప్రమాణ స్వీకారం ముగియగానే జై శ్రీరామ్ అంటూ బీజేపీ సభ్యుల నినాదాలు చేశారు. అయితే అసద్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్ తెలిపారు.
Aghori - Sri Varshini: నా బావ జైలులో నన్ను వేసేయండి.. బోరున ఏడ్చేసిన వర్షిణీ
అఘోరీ అరెస్టు తర్వాత శ్రీవర్షిణి బోరున ఏడ్చేసింది. తన బావ జైలులోనే తనను కూడా ఉంచండి అంటూ రచ్చ రచ్చ చేసింది. తనను పంపిస్తే.. జైలుకు పంపించండి లేదా అత్త మామల దగ్గరకి పంపించండి అంటూ బోరున ఏడ్చేసింది. అంతేకాని తన తల్లిదండ్రుల వద్దకు పంపించొద్దని పేర్కొంది.
అఘోరీ, శ్రీవర్షిణీ లవ్‌కు బ్రేక్ పడింది. ప్రస్తుతం అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టు ఆదేశాలతో 14 రోజుల పాటు చంచల్‌గూడ జైల్లోకి పంపారు. అయితే అఘోరీని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో.. ఆ తర్వాత శ్రీవర్షిణీ సంచలన వ్యాఖ్యలు చేసింది. అఘోరీతో పాటే తనను కూడా అరెస్టు చేయాలని కోరింది. తన బావ జైలులోనే తనను కూడా ఉంచండి అంటూ రచ్చ రచ్చ చేసింది.
అంతేకాకుడా తనను పంపిస్తే.. జైలుకు పంపించండి లేదా అత్త మామల దగ్గరకి పంపించండి అంటూ బోరున ఏడ్చేసింది. పోలీసులు ఎంత చెప్పినా వర్షిణీ అస్సలు వినిపించుకోలేదు. అఘోరీని జైలుకు పంపిన తర్వాత వర్షిణీకి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు భరోసా కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వర్షిణికి పోలీసులు ఎంత నచ్చ చెప్పినా ఆమె వినిపించుకోలేదు. తాను మైనర్‌ని కాదని.. మేజర్‌నని.. ఎక్కడైనా ఉండే హక్కు తనకు ఉందని వర్షిణి అంటోంది. తాను కావాలనుకున్న చోటుకే తనను వదిలేయాలని చెబుతోంది. అంతేకాని తన తల్లిదండ్రుల వద్దకు పంపించొద్దని పేర్కొంది.
ఇందులో భాగంగానే వర్షిణికి పలు దఫాలుగా కౌన్సిలింగ్ ఇస్తూన్నా ఆమె మాత్రం ఎవ్వరి మాట వినడం లేదు. అయితే పోలీసులు దాదాపు 15 రోజుల పాటు వర్షిణీకి కౌన్సిలింగ్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వర్షిణి తల్లిదండ్రులు తమ కూతురిని తమకే అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. అఘోరీ మాయమాటలకు వర్షిణి లోబడిందని.. తమ కూతురిని తామే ఇంటికి తీసుకెల్లిపోతామని అంటున్నారు.
aghori sri varshini | lady aghori sri varshini relation | Lady Aghori Sri Varshini Marriage | Lady Aghori Sri Varshini Love Story | latest-telugu-news | telugu-news