/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/bilgates.jpg)
Bill Gates About Indians: మైక్రోసాఫ్ఠ్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తాజాగా జెరోడా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించన పాడ్ కాస్ట్ లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా బిల్ గేట్స్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మైక్రోసాఫ్ట్ (Microsoft) ఈ స్థాయికి ఎదగడానికి భారతీయులే కారణమని బిల్ గేట్స్ అన్నారు. మైక్రోసాఫ్ట్ విజయవంతం కావడం వెనుక అనేకమంది అద్భుతమైన నిపుణులు ఉన్నారని, వారిలో అత్యధికులు భారత్ నుంచి వచ్చిన వారేనని ఆయన వెల్లడించారు.
భారతదేశంతో తనకు మొదటి నుంచి మంచి అనుబంధం ఉందని, మైక్రోసాఫ్ట్ స్థాపించాక భారత్ లో నైపుణ్యమున్న పట్టభద్రులను ఎంపిక చేసుకుని మా సంస్థలో నియమించుకున్నామని గేట్స్ అన్నారు. వారికి సియాటెల్ లో విధులు అప్పగించామని, వారు భారత్ తిరిగి వచ్చి మైక్రోసాఫ్ట్ డెవలప్ మెంట్ సెంటర్ స్థాపనలో కీలకపాత్ర పోషించారని ఆయన వివరించారు.
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల (Satya Nadella) కూడా భారత్ నుంచి వచ్చిన వారేనని, ఇప్పుడాయన మైక్రోసాఫ్ట్ లో అగ్రస్థానంలో ఉన్నారని బిల్ గేట్స్ తెలిపారు. ఐటీ రంగంలో తన కెరీర్ ప్రారంభంలో భారత్ తో ఉన్న అనుబంధం ఇప్పుడు కీలకంగా మారిందని ఆయన అన్నారు.