విద్యార్థులకు షాక్.. రక్షాబంధాన్,శ్రీరామనవమి, శివరాత్రి, హోలీ సెలవులు రద్దు.. బిహార్ ప్రభుత్వం తాజాగా సెలవుల క్యాలెండర్ విడుదల చేసింది. ఇందులో శ్రీకృష్ణ జన్మాష్టమి, రక్షాబంధన్, శ్రీరామనవమి, శివరాత్రి, తీజ్, హొలీ, సెలవులను రద్దు చేశారు. అలాగే ఉపాధ్యాయులకు కూడా 22 రోజులు మాత్రమే వేసవి సెలవులు ప్రకటించారు. By B Aravind 28 Nov 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Bihar School Holidays: బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా సెలవుల క్యాలెండర్‌ను విడుదల చేసి దాని ప్రకారం.. శ్రీకృష్ణ జన్మాష్టమి, రక్షాబంధన్, శ్రీరామనవమి, శివరాత్రి, తీజ్, హొలీ, సెలవులను రద్దు చేశారు. అదే సమయంలో ఈద్-బక్రీద్‌కు మూడు రోజులు, మొహర్రం కోసం రెండు రోజులు సెలవులు కేటాయించారు. అంతేకాదు ఉపాధ్యాయులకు వేసవి సెలవులను కూడా రద్దు చేశారు. అయితే కొత్త సెలవుల పట్టిక ప్రకారం చూసుకుంటే 60 రోజుల సెలవుల్లో.. ఉపాథ్యాయులు 38 రోజుల పాటు స్కూల్‌కు రావాల్సి ఉంటుంది. ఈ లెక్కన చూస్తే వారికి 22 రోజులు మాత్రమే వేసవి సెలవులు ఉంటాయి. మే 1వ తేదీ అయిన కార్మిక దినోత్సవం సెలవును కూడా రద్దు చేశారు. Also Read: తుది అంకానికి చేరుకున్న తెలంగాణ ఎన్నికల ప్రచారం…ఈరోజే లాస్ట్ ఇదిలాఉండగా.. ప్రత్యేక రోజులలో కూడా పాఠశాలలు తెరిచి ఉంచాలని బిహర్ సర్కార్ (Bihar Govt) గతంలోనే ఆదేశించింది. ఆ రోజుల్లో భోజన సమయానికి ముందు ఆ ప్రత్యేక దినానికి సంబంధించిన విషయాలు విద్యార్థులకు చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు హిందూ పండుగలలో సెలవులు రద్దు చేయడంపై ఉపాధ్యాయులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. Also Read: మెదక్ లో తీవ్ర విషాదం.. నీట మునిగి ఐదుగురి మృతి #bihar #cm-nitish-kumar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి