Nitish Vs DMK : 'హిందీ నేర్చుకోవాల్సిందే..' ఈ భ్రమల్లో నుంచి బయటకు రావాలని నితీశ్‌కు డీఎంకే చురకలు! దక్షిణాది ప్రతినిధులతో జరిగిన కూటమి సమావేశంలో బీహార్ సీఎం నితీశ్ సహనం కోల్పోయారు. ఆయన ప్రసంగానికి అనువాదం కావాలని డీఎంకే నేతలు కోరడంతో ఆయనకు కోపం వచ్చింది. హిందీ జాతీయ భాష అంటూ ఫైర్ అయ్యారు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 343 ప్రకారం దేశానికి జాతీయ భాష లేదు. By Trinath 20 Dec 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Hindi v/s Non-Hindi War : హిందీ వర్సెస్ నాన్-హిందీ గొడవలు ఈనాటివి కావు. దశాబ్దాలుగా ఈ ఉత్తరాది భాషను రుద్దేవారిపై దక్షిణాది రాష్ట్రాలు యుద్ధం చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా హిందీ రుద్దుడుకు వ్యతిరేకంగా గళం విప్పే రాష్ట్రం తమిళనాడు. హిందీ వ్యతిరేక ఉద్యమాలకు సెంటర్ ఆఫ్ ల్యాండ్ తహిళనాడే. పెరియర్ నుంచి ఇప్పటి సీఎం స్టాలిన్ వరకు అందరూ హిందీ ఇంపోజ్‌కు వ్యతిరేకంగా పోరాడిన వారే. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు హిందీ రుద్డుడుపై అవకాశం దొరికిన ప్రతీసారి విమర్శలు గుప్పిస్తుంటాయి. అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించాడమే లక్ష్యంగా 'INDIA' కూటమి పార్టీలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఈ కూటమిలో బీజేపీ(BJP) ని వ్యతిరేకించే పార్టీలన్ని ఉన్నాయి. ఇందులో దక్షిణాది పార్టీల ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. ఎందుకటే బీజేపీకి దక్షిణాదిన ప్రస్తుతం ఒక రాష్ట్రం కూడా లేదు. సహజంగా హిందీ భాష రుద్దుడుపై వ్యతిరేకంగా ఉండే తమిళ పార్టీలు INDIA కూటమీలో భాగంగా నార్త్ పార్టీలతో కలిసి పనిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే నాలుగో సారి ఈ కూటమి భేటీ అవ్వగా..ఈ మీటింగ్‌లో బీహార్ సీఎం నితీశ్‌కుమార్ నోరుపారేసుకున్నారు. Also Read: రోహిత్ శర్మ జట్టులో కొనసాగుతాడా? తేల్చేసిన ముంబై హెడ్ కోచ్! హిందీ నేర్చుకోవాలంట: బీహార్ సీఎం నితీష్ కుమార్(Nitish Kumar) దక్షిణాది ప్రతినిధులతో జరిగిన కూటమి సమావేశంలో పాల్గొన్నారు. ఈ మీటింగ్‌లో మాట్లాడుతుండగా.. మిత్రపక్షమైన డీఎంకే హిందీలో చేసిన ఆయన ప్రసంగానికి అనువాదం కావాలని కోరింది. డీఎంకే సీనియర్ నాయకుడు టీఆర్ బాలుతో పాటు అక్కడున్న మిగిలిన వారికి నితీశ్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. అందుకే అనువాదం కోసం రాష్ట్రీయ జనతాదళ్ ఎంపి మనోజ్ కె ఝాకు సంకేతాలు ఇచ్చారు. బాలుకు సహాయం చేయడానికి, ఝా నితీష్ కుమార్ నుంచి అనుమతి కోరారు. అయితే బీహార్ సీఎం సహనం కోల్పోయారు. 'మేము మన దేశాన్ని హిందుస్థాన్ అని పిలుస్తాము, హిందీ మా జాతీయ భాష.. మన భాష మనకు తెలియాలి.' అని కామెంట్స్ చేశారు. అంతటితో ఆగలేదు తన ప్రసంగాన్ని అనువదించవద్దని మనోజ్ ఝాకు నితీశ్ చెప్పడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. హిందీ జాతీయ భాష కాదు: అనేక మంది హిందీయేతర భారతీయులు భ్రమ పడుతున్నట్లుగా హిందీ దేశ జాతీయ భాష కాదు. దేశ భాష అనే హోదాను రాజ్యాంగం ఏ భాషకూ ఇవ్వలేదు. రాజ్యాంగం ప్రకారం అధికారిక భాషలే ఉన్నాయి. రాజ్యాంగంలోని 17వ భాగం అధికార భాషకు సంబంధించినది . రాజ్యాంగంలోని ఆర్టికల్ 343 ప్రకారం దేశానికి అధికారిక భాషలు ఉన్నాయి. జాతీయ భాష లేదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ డీఎంకే నేతలు చురకలంటిస్తున్నారు. Also Read: ఈ ఇద్దరి ఆస్ట్రేలియా తోపులను పట్టించుకోని ఫ్రాంచైజీలు.. అన్‌సోల్డ్ ఫుల్ లిస్ట్ ఇదే! WATCH: #india-bloc #cm-nitish-kumar #mk-stalin #dmk #hindi-version మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి