Big boss winner Prasanth:జైలు నుంచి విడుదల అయిన రైతుబిడ్డ..మళ్ళీ అదే రచ్చ చేసిన ఫ్యాన్స్

బిగ్ బాస్ విజేత రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఈ రోజు సాయంత్రం చంచల్ గూడ జైలు నుంచి విడుదల అయ్యాడు. నిన్న నాంపల్లి కోర్టు అతనికి షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.

New Update
Big boss winner Prasanth:జైలు నుంచి విడుదల అయిన రైతుబిడ్డ..మళ్ళీ అదే రచ్చ చేసిన ఫ్యాన్స్

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రోజున అన్నపూర్ణ స్టుడియోస్ దగ్గర జరిగిన దాడి ఘటనలో ప్రశాంత్‌ని ఏ 1 నిందితుడిగా చేర్చుతూ బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ మీద క్రిమినల్ కేసుని నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో ప్రశాంత్‌తో పాటు అతని తమ్ముడు మనోహర్‌ని కూడా అరెస్ట్ చేసి కోర్టుకి తరలించగా.. వీరికి 14 రోజుల రిమాండ్‌ను విధించింది కోర్టు. అయితే ప్రశాంత్ అరెస్ట్ అయిన 48 గంటల్లోనే నాంపల్లి కోర్టు అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నిన్న బెయిల్ మంజూరు కాగా.. చంచల్ గూడ జైలులో రిలీజ్ ప్రాసెస్ ఆలస్యం కావడంతో ఈరోజు సాయంత్రం ఆరుగంటలకు జైలు నుంచి బయటకు వచ్చాడు.

Also Read:ఆస్తమాకు చెక్ పెట్టే మొక్కలు..మీ ఇంట్లో ఇవి ఉండేలా చూసుకోండి

అయితే ఇంత జరిగినా ప్రశాంత్ ఫ్యాన్స్ కు మాత్రం బుద్ధి రాలేదు. అతను జైలు నుంచి విడుదల కాబోతున్నాడన్న సమాచారం తెలుసుకుని భారీగా అభిమానులు చంచల్ గూడ జైలుకు చేరుకున్నారు. యూట్యూబ్ ఛానల్స్‌తో పాటు మీడియా హడావిడి కూడా ఎక్కువగా ఉండటంతో.. వాళ్లని కంట్రోల్ చేయడానికి పోలీసులు నానా తిప్పలు పడ్డారు. నిజానికి ప్రశాంత్ జైలుకిపోయాడంటే.. అతని ఫ్యాన్స్ చేసిన రచ్చ వల్లే.. ఇప్పుడు అతను జైలు నుంచి రిలీజ్ అయ్యేటప్పుడు కూడా ఇదే రచ్చ కనిపించింది.అయితే కోర్టు షరతుల ప్రకారం ప్రశాంత్ మీడియాతో మాట్లాడకూడదు. ఎలాంటి విజయోత్సవాలు నిర్వహించకూడదు. ప్రతినెల ఒకటో తేదీన.. 16వ తేదీన హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో హాజరై సంతకం చేయాలని స్పష్టం చేసింది కోర్టు. అందుకే ప్రశాంత్ మీడియా కంట పడకుండానే కారులో జైలు నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు.

Advertisment
Advertisment
Advertisment