EMI : లోన్లు తీసుకునేవారికి బిగ్ షాక్...పెరగనున్న ఈఎంఐలు..!!

గృహ రుణాలు, ఈఎంఐలకు సంబంధించి ఆర్ బిఐ కొత్త రూల్స్ తీసుకువచ్చింది. దీంతో లోన్స్ పొందడం కష్టంగా మారనుంది. ఈఎంఐలు కూడా భారీగానే పెరగనున్నాయి. ఆర్ బిఐ కొత్త రూల్స్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

New Update
ICICI, Kotak బ్యాంకులకు RBI షాక్.. భారీగా జరిమానా.. ఎందుకంటే?

RBI New Rules: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జారీ చేసిన కొత్త మార్గదర్శకాలతో రుణాలు కాస్త ఇబ్బందికరంగా మారనున్నాయి. వడ్డీ రేట్లు పెరిగినప్పుడు బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు పలు హోం లోన్స్ (Home Loans), ఈఎంఐలను (EMI) పెంచుతాయి. కొత్తగా లోన్స్ తీసుకునేందుకు దరఖాస్తు చేసుకునేవారి అర్హత తగ్గుతుంది. రుణాలు తీసుకునేవారికి ఫిక్డ్స్ వడ్డీ రేటు నుంచి ఫ్లోటింగ్ వడ్డీరేటుకు మార్చుకునే అవకాశం ఇవ్వాలని ఆర్బిఐ ఈ మధ్య నిర్వహించిన ద్రవ్యపరపతి సమీక్ష సమావేశంలో వెల్లడించింది. దీంతో ఇక నుంచి బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు లోన్లు మంజూరు చేసే సమయంలో వీటికి సంబంధించిన అదనపు ఛార్జీలు భవిష్యత్తులో ఎలా ఉంటాయో ముందే రుణగ్రహీతలకు వెల్లడించాల్సి ఉంటుంది. అంటే రుణగ్రహీతలు తమ రుణంపై వడ్డీరేటును ఫిక్స్డ్ రేటు నుంచి ఫ్లోటింగ్ రేటుకు మార్చుకోకున్నా లేదంటే ఫ్లోటింగ్ రేట్ నుంచి ఫిక్స్డ్ రేట్ కు మార్చుకున్నా ఎంత ఛార్జీ వసూలు చేయాలి...భవిష్యత్తులో వడ్డీ రేటు ఎంత పెరుగుతుంది, ఈఎంఐ ఎంత పెరుగుతుందనే వివరాలు తప్పకుండా ముందే వెల్లడించాల్సి ఉంటుంది.

వడ్డీరేట్లు పెరిగినట్లయితే...రుణదాతలు EMIలోన్ పై నెలవారీ వడ్డీని కవర్ చేసేలా చూసుకోవాలి. ఈఎంఐ చెల్లించిన తర్వాత లోన్ బకాయి మునపటి నెలకంటే ఎక్కువగా పెరగకుండా చూసుకోవాలి. ఈఎంఐ ఆధారిత పర్సనల్ లోన్స్ పై ఫ్లోటింగ్ ఇంట్రెస్టింగ్ రేట్స్ ను రీసెట్ చేసే విషయంలోనూ రుణదాతలు ప్రస్తుత వడ్డీరేట్ల ఆధారంగా తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని లెక్కించవద్దంటూ ఆర్బీఐ జారీ చేసిన సర్క్యూలర్ లో పేర్కొంది. అయితే వడ్డీరేట్లు పెరిగినప్పటికీ రుణగ్రహీతలు తిరిగి చెల్లిస్తారని నిర్దారించుకునేందుకు హెడ్ రూమ్ వదిలేయాలంటూ పేర్కొంది.

అయితే గతంలో లోన్ వడ్డీరేట్లు 6శాతం పాయింట్ల వరకు మారాయి. ఈఎంఐని పొడగించడం ద్వారా ఎక్కువ వడ్డీని పొందుతారు. రుణదాత ఎప్పుడూ కూడా ఈఎంఐని రీసెట్ చేయరు. కొత్తరూల్స్ ప్రకారం రుణదాతలు తిరిగి చెల్లింపు సామార్థ్యాన్ని ప్రస్తుత రేటు కంటే ఎక్కువలెక్కించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, పదవీ విరమణ చేయడానికి 20 సంవత్సరాలు ఉన్న రుణగ్రహీత 6.5% వడ్డీ రేటుతో రూ. 1 కోటి రుణం కోసం రూ. 74,557 EMIని భరించగలరు. అయితే, ఈ స్థోమత 11% వడ్డీ రేటుతో రూ. 72 లక్షలకు తగ్గుతుంది.

వడ్డీ రేట్లు పెరిగిన అనంతరం బ్యాంకులు అనవసరంగా హోంలోన్ ఈఎంఐలను పెంచడంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆర్బీఐ నిబంధనలను సమీక్షిస్తుందని గవర్నర్ శక్తికాంత దాస్ (Governor Shaktikanta Das) గత వారం వెల్లడించారు. రుణగ్రహీత చెల్లింపు సామర్థ్యం, అతని చెల్లింపు సామర్థ్యం ఎంతకాలం కొనసాగుతుంది, వయస్సును బట్టి బ్యాంకులు తగిన పదవీకాలాన్ని అంచనా వేయవలన్నారు. వ్యక్తులను బట్టి కాదని తెలిపారు. లోన్ తీసుకునే వారికి కొత్త రూల్స్ డిసెంబర్ 31, 2023 నుంచి వర్తిస్తాయి.

Also Read: జాబిల్లి ఫొటోలు పంపిన విక్రమ్ ల్యాండర్..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు