Big Breaking: తెలంగాణ కొత్త సీఎం, డిప్యూటీ సీఎంలు వీరే? తెలంగాణ సీఎంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డికి డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ రోజు సాయంత్రం హైకమాండ్ నుంచి ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. By Nikhil 05 Dec 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణ సీఎం (Telangana CM) ఎవరనే అంశంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేరును ఆ పార్టీ హైకమాండ్ ఖారు చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయ సేకరణ, సీనియర్ నేతలతో చర్చ తర్వాత రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించాలని సోనియా గాంధీ తుది నిర్ణయానికి వచ్చింది. ఈ విషయాన్ని ఈ రోజు సాయంత్రం అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు హైకమాండ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం హోటల్ ఎల్లాలో సీఎల్పీ భేటీ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆ సీఎల్పీ భేటీలోనే రేవంత్ పేరును ప్రకటించనున్నారు. ఇది కూడా చదవండి: Telangana CM: తెలంగాణ సీఎం ఎంపికలో బిగ్ ట్విస్ట్.. డీకే ఇంటికి వైసీపీ ఎంపీ.. అసలేం జరుగుతోంది? ఈ మేరకు ఢిల్లీ నుంచి డీకే శివకుమార్, కేసీ వేణుగోపాల్ తదితరులు బయలుదేరారు. వారు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా హోటల్‌కు వెళ్లనున్నారు. ప్రకటన తర్వాత ఈ నెల 7న రేవంత్ సీఎంగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. మొదటగా రేవంత్‌తో పాటు ఐదుగురు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. అనంతరం 9న మంత్రివర్గ విస్తరణ చేపట్టి.. అదే రోజు భారీ బహిరంగ సభను నిర్వహించాలన్నది రేవంత్ ప్లాన్ గా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క కు డిప్యూటీ సీఎం పదవులు దక్కడం ఖాయంగా తెలుస్తోంది. ప్రాధాన్యత కలిగిన శాఖలను తమకు కేటాయించాలని ఈ ఇరువురు నేతలు పెట్టిన డిమాండ్ కు హైకమాండ్ ఓకే చెప్పినట్లు సమాచారం. రేవంత్ తో పాటు ఈ ఇరువురు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. #cm-revanth-reddy #sonia-gandhi #telangana-elections-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి