భోళాశంకర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెబుతారా? టిక్కెట్ ధరలు పెంచకుండా ఉంటారా?

హైదరాబాద్ శిల్పకళావేదికలో ఈ ఫంక్షన్ జరగనుంది. అయితే ఈ మధ్యకాలంలో పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడల్లా టికెట్ల ధరలు పెంచడం కామన్ అయిపోయింది. దీనివల్ల సామాన్య ప్రజలు ఫ్యామిలీతో కలిసి సినిమా చూడలేకపోతున్నారు. కానీ భోళా శంకర్‌ టికెట్ల ధరల విషయంలో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న ధరలే ఈ సినిమాకు కూడా వర్తిస్తాయని..

New Update
భోళాశంకర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెబుతారా? టిక్కెట్ ధరలు పెంచకుండా ఉంటారా?

ప్రస్తుతం వరుస హిట్ లతో మంచి జోష్ లో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు మరోసారి 'భోళా శంకర్' మూవీతో మన ముందుకు వస్తున్నారు. ఈ సారి హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏ థియేటర్ దగ్గర చూసినా కటౌట్లు, పోస్టర్లు భారీగా దర్శనమిస్తున్నాయి. మరోవైపు చిత్ర యూనిట్ కడా ప్రమోషన్లను కూడా స్టార్ట్ చేశారు.

ఈ క్రమంలోనే ఆగష్ట్ 6వ తేదీన భోళా శంకర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో గ్రాండ్ జరపనున్నారు. హైదరాబాద్ శిల్పకళావేదికలో ఈ ఫంక్షన్ జరగనుంది. అయితే ఈ మధ్యకాలంలో పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడల్లా టికెట్ల ధరలు పెంచడం కామన్ అయిపోయింది. దీనివల్ల సామాన్య ప్రజలు ఫ్యామిలీతో కలిసి సినిమా చూడలేకపోతున్నారు. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న ధరలే ఈ సినిమాకు కూడా వర్తిస్తాయని సమాచారం.

ఇక ఇప్పటికే హైదరాబాద్‌ లో ఈ మూవీకి అడ్వాన్స్‌ టికెట్ల బుకింగ్ ప్రారంభం కాగా.. మరో రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇతర ప్రాంతాల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్‌ లు ప్రారంభం కానున్నాయి. అలాగే ఈ మూవీకి సెన్సార్‌ కూడా పూర్తయ్యింది. సెన్సార్‌ బోర్డ్‌ మెగాస్టార్‌ చిరంజీవి చిత్రానికి యూ/ఏ (U/A) రేటింగ్ ఇచ్చింది. ఇక భోళాశంకర్‌ రన్‌టైమ్‌ సుమారు 160 నిమిషాలు (2 గంటల 40 నిమిషాలు) ఉండనుంది. ఏది ఏమైనా భోళాశంకర్ టిక్కెట్ ధర పెంచకుండా ఉంటే బావుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ విషయంలో మేకర్స్ త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

కాగా భోళా శంకర్ సినిమాకి మెహర్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన మిల్కీబ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా కనిపించనుంది. కీర్తి సురేష్ మెగాస్టార్‌ చెల్లెలిగా నటించింది. అలాగే సుశాంత్‌, మురళీ శర్మ, రావు రమేష్‌, రష్మీ, శ్రీముఖి, వెన్నెల కిశోర్‌, రవిశంకర్‌, రఘుబాబు, ఉత్తేజ్‌, గెటప్‌ శీను తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏకే ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ బ్యానర్‌ పై రామబ్రహ్మం సుంకర భోళాశంకర్‌ మూవీని నిర్మించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు