Ola Maps : గూగుల్ మ్యాప్స్‌కు ప్రత్యామ్నాయంగా ఓలా మ్యాప్స్.. గూగల్ మ్యాప్స్‌కు ప్రత్యామ్నాయంగా ఓలా కంపెనీ మరో ఫీచర్‌ను లాంఛ్ చేసింది. ఓలా యాప్‌లో.. 'ఓలా మ్యాప్స్'ను తీసుకొచ్చినట్లు ఆ సంస్థ సీఈవో భావిష్ అగర్వాల్ తెలిపారు. గతంలో మ్యాప్స్ కోసం ఏడాదికి రూ.100 కోట్ల ఖర్చు చేసేవాళ్లమని ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదని చెప్పుకొచ్చారు. By B Aravind 06 Jul 2024 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి Bhavish Aggarwal : ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లాలంటే ఒకప్పుడు ఇతరులను రూట్ అడుక్కుంటూ వెళ్లేవాళ్లు. కానీ ఇప్పుడు చాలామంది గూగుల్ మ్యాప్స్ (Google Maps) పైనే ఆధారపడుతున్నారు. ఎక్కడికి వెళ్లాల్సి వచ్చిన గూగల్ మాప్స్ సహాయంతోనే తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా ఓలా, రాపిడో వంటి సంస్థలు కూడా గూగల్ మ్యాప్స్‌పైనే ఆధారపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గూగల్ మ్యాప్స్‌కు ప్రత్యామ్నాయంగా ఓలా కంపెనీ మరో ఫీచర్‌ను లాంఛ్ చేసింది. ఓలా యాప్ (Ola App) లో.. 'ఓలా మ్యాప్స్' (Ola Maps) ను తీసుకొచ్చినట్లు ఆ సంస్థ సీఈవో భావిష్ అగర్వాల్ తెలిపారు. Also Read: లిక్కర్ స్కామ్ తరహాలో మరో కుంభకోణంలో ఇరుక్కున ఆప్ గతంలో మ్యాప్స్ కోసం ఏడాదికి రూ.100 కోట్ల ఖర్చు చేసేవాళ్లమని.. ఇకనుంచి అలాంటి ఖర్చు ఉండదని పేర్కొన్నారు. ఓలా యాప్ యూజర్లు వెంటనే దీన్ని అప్డేట్ చేసుకోవాలని కోరారు. ఈ మ్యాప్స్‌లో.. స్ట్రీట్‌వ్యూ, ఇండోర్ ఇమెజ్లు, 3D మ్యాప్‌లు, డ్రోన్ మ్యాప్‌లు వంటి ఫీచర్స్ త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. Also read: హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్ After Azure exit last month, we’ve now fully exited google maps. We used to spend ₹100 cr a year but we’ve made that 0 this month by moving completely to our in house Ola maps! Check your Ola app and update if needed 😉 Also, Ola maps API available on @Krutrim cloud! Many more… pic.twitter.com/wYj1Q1YohO — Bhavish Aggarwal (@bhash) July 5, 2024 #google-maps #ola-maps #ola-app మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి