Bhatti Vikramarka: బీజేపీ నేతలు చెబితేనే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు.. భట్టి సంచలన ఆరోపణలు!

బీజేపీ అధిష్టానం చెబితేనే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. బడ్జెట్ ప్రసంగం పూర్తిగా వింటే కేసీఆర్ కు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థమయ్యేదన్నారు. కేసీఆర్ మాటలకు నవ్వాలా? ఏడ్వాలో? అర్థం కావట్లేదంటూ ఎద్దేవా చేశారు.

New Update
Bhatti Vikramarka: బీజేపీ నేతలు చెబితేనే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు.. భట్టి సంచలన ఆరోపణలు!

Telangana: హడావుడి అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యే వరకు అసెంబ్లీలో ఉండకుండా బయటకు వెళ్లి మీడియా సమావేశం పెట్టడంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. కేంద్రం నుంచి హక్కుగా రావాల్సిన నిధుల కోసం అసెంబ్లీలో పెట్టిన చర్చకు కేసిఆర్ హడావుడిగా వస్తే బాగుండేదన్నారు. బడ్జెట్ ప్రసంగం పూర్తిగా వింటే కేసీఆర్ కు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థమయ్యేదన్నారు. కెసిఆర్ కు రెస్ట్ తీసుకోమని ప్రజలు సమయం ఇచ్చారు. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు చెప్పితే హడావుడిగా అసెంబ్లీకి వచ్చి హడావుడిగా బయటకు వెళ్లి పోయారన్నారు.

సంక్షేమం- అభివృద్ధి సమభాగంలో..
ఇక బడ్జెట్ గురించి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం బడ్జెట్లో రూ.17,700 కోట్లు దళిత బందుకు కేటాయించి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు. దళితుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన మాజీ సీఎం కేసీఆర్ ఈ బడ్జెట్లో దళిత బంధు ప్రస్తావించలేదని మాట్లాడటం నవ్వాలా? ఏడ్వాలో? అర్థం కావడం లేదంటూ ఎద్దేవా చేశారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను గత ప్రభుత్వం మాదిరిగా డైవర్ట్ చేయం. బ్యాక్ లాగ్ నిధులను కూడా కలుపుకొని దళిత, గిరిజనులకు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు పెడతాం.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం సంక్షేమం- అభివృద్ధికి సమభాగంలో నిధులు వెచ్చిస్తూ మేలు కలయికతో ముందుకు తీసుకువెళ్తున్నాం. హైదరాబాద్ మౌలిక వసతుల కల్పనకు ఎన్నడు లేని విధంగా ఈ బడ్జెట్లో పది వేల కోట్ల రూపాయలు కేటాయించాం. హైదరాబాద్ నగర అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని అభివృద్ధి చేస్తోంది. హైదరాబాదులో ఉద్యోగ వ్యవస్థలు రావడానికి కావలసిన ఎకో సిస్టం డెవలప్ చేయడానికి కావలసిన నిధులను పెట్టుబడిగా పెడుతూ మా ప్రభుత్వం ముందుకు వెళుతున్నది. రాష్ట్ర అభివృద్ధికి మణిహారంగా ఉన్న హైదరాబాదును అభివృద్ధి చేయడం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా పెట్టుకున్నామని చెప్పారు.

ఇది కూడా చదవండి: Telangana Budget 2024: తెలంగాణ ప్రజల ఆశలపై నీళ్లు.. సర్కార్ ను చీల్చి చెండాడుతాం: కేసీఆర్

హైదరాబాదులో స్కిల్ యూనివర్సిటీ..
అలాగే భవిష్యత్ తరాలకు అవసరమయ్యే హ్యూమన్ రిసోర్స్ తయారీ కోసం హైదరాబాదులో పునాదులు వేస్తున్నామన్నారు. హైదరాబాదులో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం విజీనరితో తీసుకున్న మిషన్. రాష్ట్రంలో విద్యావ్యవస్థపై పెద్ద ఎత్తున ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నాం. అంగన్ వాడీలను మూడవ తరగతి వరకు అప్ గ్రేడ్ చేస్తున్నాం. ప్రభుత్వ ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలో 4వ తరగతి నుంచి అడ్మిషన్లు తీసుకునేలా నిర్ణయం తీసుకున్నాం. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుతో దేశానికి మొత్తం తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలువబోతున్నది. ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం హైదరాబాద్ అభివృద్ధి కీ ప్రత్యేక ఫోకస్ పెట్టి బడ్జెట్లో పెద్దపీట వేశాం. హైదరాబాదులో ఏర్పాటు చేయబోతున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ దేశానికి మార్గదర్శకంగా ఉండబోతుంది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కసరత్తు పూర్తయింది నిధులు కేటాయించాం. కోటి మంది మహిళలను కోటీశ్వరులు గా చేయాలని మా ప్రభుత్వం మహిళా సంక్షేమానికి బడ్జెట్లో నిధులను కేటాయించిందన్నారు.

ప్రతి సంవత్సరం రాష్ట్రంలోని మహిళా సంఘాలకు 20 వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం. వారు చెల్లించాల్సిన వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రతి నియోజకవర్గంలో మైక్రో స్మాల్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నాం. మహిళలు ఆర్థిక సాధికారత సాధించడానికి మైక్రో స్మాల్ ఇండస్ట్రీలను వారికి కేటాయించబోతున్నాం. ప్రజా ప్రభుత్వం వారికి అందించే ప్రోత్సాహకాల వల్ల మహిళలు ఆర్థిక పరిపుష్టి తో ఆర్థిక సాధికారత సాధించి దేశానికి ఆదర్శంగా నిలుస్తారు. ఇందిరమ్మ రాజ్యం లో మహిళలను మహాలక్ష్మిలుగా కొలుస్తాం. డ్వాక్రా సంఘాలు ఉత్పత్తి చేసే వస్తువులను మార్కెటింగ్ చేసుకోవడానికి హైదరాబాదులో మూడున్నర ఎకరాలు భూమిని మహిళల కోసం కేటాయించాం. రాష్ట్రంలో మహిళలందరిపై సమానమైన దృష్టిని మా ప్రభుత్వం కేంద్రీకరించి వారి అభివృద్ధికి పాటుపడుతుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు