రేపే భారత్ ఎన్సీఈపీ ప్రారంభం... ఇక భారతీయ వాహనాలు మరింత సేఫ్టీ...! ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘భారత్ న్యూ కార్ అసెస్ మెంట్ ప్రోగ్రామ్’ను రేపు ప్రారంభించనున్నారు. బీఎన్ సీఏపీని కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ దీన్ని ప్రారంభించనున్నట్టు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారతీయ కార్ల భద్రను మరింత మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన బీఎన్ఏపీపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. By G Ramu 21 Aug 2023 in నేషనల్ New Update షేర్ చేయండి ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘భారత్ న్యూ కార్ అసెస్ మెంట్ ప్రోగ్రామ్’ను రేపు ప్రారంభించనున్నారు. బీఎన్ సీఏపీని కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ దీన్ని ప్రారంభించనున్నట్టు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారతీయ కార్ల భద్రను మరింత మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన బీఎన్ఏపీపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. తాజాగా ఇప్పుడు ఆ కార్యక్రమం కార్య రూపం దాల్చుతోంది. ఈ బీఎన్ఏపీ అనేది ఇండియన్ ఆటో మొబైల్ ఇండస్ట్రీలో వాహనాల భద్రతా ప్రమాణాలను పెంచేందుకు ఉద్దేశించిన కార్యక్రమం. అంతర్జాతీయ మార్కెట్‌లలో భారతీయ కార్లకు మంచి ఇమేజ్ కల్పించి వాటిని అంతర్జాతీయ స్థాయికి చేర్చడం లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత ఎన్సీఈపీ అనేది అచ్చం గ్లోబల్ ఎన్సీఈపీ లాగానే వుంటుంది. దేశంలోని తయారీదారులు స్వచ్ఛందంగా అందించే కొత్త కార్లను ఈ ప్రోగ్రామ్ ద్వారా క్రాష్-టెస్ట్ చేస్తారు. సమగ్రంగా క్రాష్ టెస్టులు చేసిన తర్వాత సదరు కార్లకు సేఫ్టీ పరంగా రేటింగ్స్ ఇస్తారు. ఈ రేటింగ్ లు అనేవి దేశంలోని కార్ల కొనుగోలు దార్లకు కారు భద్రత గురించి సమచారం అందిచండంతో వాళ్లు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఉపయోగపడుతాయి. ఈ నూతన రేటింగ్ విధానం అనేది అటు కొనుగోలుదారులకు అటు భారత ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనకరంగా వుంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతానికి, మన దేశంలో తయారు అవుతున్న కార్లు తక్కువ సురక్షితమైనవి అనే భావన ప్రజల్లో వుంది. దీంతో పాటు గతంలో నాణ్యతా పరమైన ప్రమాణాలపై నెలకొన్న అనుమానాల దృష్ట్యా ఇప్పుడు కూడా అంతర్జాతీయ మార్కెట్ లో మన వాహనాలను నాణ్యతలేని వాహనాలుగా పరిగణిస్తున్నారు. ఈ కార్యక్రమం అమలులోకి వచ్చి సేఫ్టీ రేటింగ్స్ ఇస్తే అది దేశీయ తయారీదారులకు అత్యంత ఉపయోగకరంగా వుంటాయి. ఈ రేటింగుల వల్ల తమ కార్లు చాలా సురక్షితమైనవని అంతర్జాతీయ మార్కెట్‌ల్లో గుర్తింపు పొందుతాయి. దీంతో అంతర్జాతీయ మన కార్ల ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. దీంతోపాటు దేశీయ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. #cars #nitin-gadkari #automobiles #safety #bharat-ncap మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి