Winter Eat Eggs: చలికాలంలో గుడ్లను ఇలా తింటే బెస్ట్‌.. లేదంటే కష్టమే..!!

గుడ్లలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ మొదలైన అనేక పోషకాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. గుడ్లతో బరువు తగ్గడంతోపాటు, ఎముకలును ఎంతో మెరుగు పరుస్తుంది. గుడ్లను అల్పాహారం, మధ్యాహ్న భోజనంలో తీసుకోవచ్చు. చలికాలంలో రోజూ ఒక గుడ్డు తింటే ఆరోగ్యానికి మేలు.

New Update
Winter Eat Eggs: చలికాలంలో గుడ్లను ఇలా తింటే బెస్ట్‌.. లేదంటే కష్టమే..!!

Winter Eat Eggs: శీతకాలంలో ఏ ఆహారం తిన్న కొద్దిగా వేడిగా తినాలనిపిస్తుంది. అయితే.. గుడ్లు తినడానికి చాలామంది ఇష్టపడతారు. కానీ.. తరచుగా గుడ్లు సరైన పద్ధతిలో తినరు. శీతకాలంలో గుడ్లు తినే వారు వాటిని ఎలా తినాలో కచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే లాభం కన్న నష్టమే ఎక్కవగా వస్తుంది. గుడ్లు తింటే ఎలాంటి లాభాలు, కష్టాలలున్నాయో..? ఆహారంలో గుడ్లు ముఖ్యమైన భాగం. గుడ్లలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ మొదలైన అనేక ముఖ్యమైన పోషకాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. గుడ్లు తినడం, సిద్ధం చేయడం చాలా సులభంగా ఉంటుంది. వీటిని వేయించి, ఆమ్లెట్‌లు, ఉడకబెట్టి ఎక్కవగా తింటారు. వీటిని రుచికరమైన, సులభంగా వండగలిగే ఆహారంలో ఇది ఒకటి. గుడ్లతో బరువు తగ్గడంతోపాటు, ఎముకలు, ఆరోగ్యాన్ని ఎంతో మెరుగు పరుస్తుంది. గుడ్లను అల్పాహారం, మధ్యాహ్న భోజనంలో తీసుకోవచ్చు. చలికాలంలో రోజూ ఒక గుడ్డు తింటే ఆరోగ్యానికి మేలు. గుడ్లు తినడానికి సరైన మార్గం ఏమిటో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఉడకబెట్టిన కోడిగుడ్లు:
ఉడకబెట్టిన కోడిగుడ్లను ఎప్పుడు వడినా వెంటనే వాటిని తినాలి. ఉడకబెట్టిన గుడ్లను పొట్టు తీసి గంటల తరబడి బయట ఉంచితే అందులో హానికరమైన బ్యాక్టీరియా పెరుతుంది. అందుకని.. ఉడికించిన గుడ్లు పొట్టు తీసి కనీసం 2 గంటల్లోపు తింటే చాలా మంచిది. ఇలా తింటే బ్యాక్టీరియా పెరుగుదల తగ్గుతుంది.
తక్కువ నూనె బెస్ట్
గుడ్లు వండేటప్పుడు తక్కువ నూనె వేసుకోవాలి. ఎక్కువ నూనెను వేస్తే గుడ్లు ఉడికించడం వల్ల వాటి కేలరీలు, కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇలా వండిన కూర తింటే ఆరోగ్యానికి హానికరం. అందువల్ల, గుడ్లను ఎప్పుడూ తక్కువ నూనెలో ఉడికించి తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు అంటున్నారు.
గుడ్డు సరిగ్గా ఉడకాలి
గుడ్డును వండేటప్పుడు పూర్తిగా ఉడికించుకోవాలి. కొన్నిసార్లు ఉడకని గుడ్లు ఇన్ఫెక్షన్‌ను వ్యాప్తి చేసే హానికరమైన బ్యాక్టీరియాను రావచ్చు. గుడ్డును ఉడికించినప్పుడల్లా.. చిన్న మంటపై 10 నుంచి 15 నిమిషాలు ఉడికించాలి. ఇలా ఎక్కువసేపు ఉడికించడం వల్ల గుడ్డులోని బ్యాక్టీరియా మొత్తం చనిపోయి తినడానికి సురక్షితంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: అర్ధరాత్రి ఆకలేస్తే ఈ ఆహారాలు తినండి.. ఆరోగ్యానికి మంచిది

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Realme 14T 5G: రియల్‌మి నుంచి బ్లాక్ బస్టర్ స్మార్ట్‌ఫోన్.. సేల్ షురూ - ధర, ఆఫర్ల వివరాలివే!

రియల్‌మి కొత్త ఫోన్ లాంచ్ అయింది. కంపెనీ ఇటీవల 14టి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఇవాళ దాని సేల్ ప్రారంభం అయింది. మొదటి సేల్‌లో రూ.1000 బ్యాంక్ డిస్కౌంట్, రూ. 2,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుక్కోవచ్చు.

New Update
Realme 14T 5G launched

Realme 14T 5G launched

ప్రముఖ టెక్ బ్రాండ్ రియల్‌మీ భారత మార్కెట్లో మరో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది.  Realme 14T 5Gని విడుదల చేసింది. ఈ ఫోన్ 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే 6,000mAh బ్యాటరీతో వచ్చింది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, వెనుక భాగంలో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇప్పుడు ఈ Realme 14T 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర గురించి తెలుసుకుందాం. 

Realme 14T 5G Price

Realme 14T 5G స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. అందులో 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999గా ఉంది. అలాగే 8GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్ సర్ఫ్ గ్రీన్, లైటింగ్ పర్పుల్, అబ్సిడియన్ బ్లాక్ కలర్‌లలో లభిస్తుంది. లాంచ్ ఆఫర్‌‌లో భాగంగా.. కస్టమర్‌లు ఆన్‌లైన్‌లో కొనుగోలు పై ఫ్లాట్ రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంట్ పొందుతారు. అదే సమయంలో రూ. 2,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ మొదటి సేల్ ఇవాళ్టి నుంచి ప్రారంభం అయింది. దీనిని ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి అధికారిక వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా కొనుక్కోవచ్చు. 

Realme 14T 5G Specifications

Realme 14T 5G స్మార్ట్‌ఫోన్ HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1200 nits హై బ్రైట్‌నెస్, 2000 nits పీక్ బ్రైట్‌నెస్‌తో 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. సేఫ్టీ కోసం ఫోన్‌లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఇచ్చారు. దీనిలో RAMని వర్చువల్ RAMతో 10GB వరకు విస్తరించవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా Realme UI 6పై పనిచేస్తుంది. అలాగే 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. 

14T 5G ఫోన్ వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ఓమ్నివిజన్ OV50D40 ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ మోనోక్రోమ్ కెమెరా ఉన్నాయి. వీడియో కాలింగ్, సెల్ఫీ కోసం 16-మెగాపిక్సెల్ సోనీ IMX480 ఫ్రంట్ కెమెరా ఉంది. వీటితో పాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, 300% అల్ట్రా వాల్యూమ్ మోడ్, డ్యూయల్ మైక్ నాయిస్ క్యాన్సిలేషన్, హైబ్రిడ్ మైక్రో SD స్లాట్ ఉన్నాయి. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP66, IP68, IP69 రేటింగ్‌లు అందించారు.

tech-news | telugu tech news | tech-news-telugu

Advertisment
Advertisment
Advertisment