Health News: ఇవి తీసుకుంటే.. హైబీపీ, కిడ్నీలో రాళ్ల సమస్యలు దరిచేరవు ప్రస్తుతం మానవుల జీవనశైలీ పూర్తిగా మారిపోయింది. ఈ బిజీ లైఫ్‌లో ఇంటా బయట ఇష్టమైన ఆహారాన్ని విచ్చలవిడిగా తింటూ అనేక సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో చాలామంది బాధపడుతున్నారు. ముఖ్యంగా యువతలో కూడా చాలామది అధిక బీపీతో ఇబ్బందులు ఎదుర్కొవడం ఆందోళన కలిగిస్తోంది. By B Aravind 17 Oct 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి మానవుల జీవనశైలి మారిపోవడంతో చాలా మంది.. బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలకి సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా యువతలో చాలామది అధిక బీపీతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధిక రక్తపోటు అనేది శరీరంలో గుండె సమస్యలను పెంచుతుంది. కానీ జీవనశైలిలో మార్పులు చేసుకుంటే ఈ సమస్యను నియంత్రించవచ్చు. హైబీపీతో బాధపడుతున్నట్లయితే ఎక్కువ ఉప్పు, తీపి, కొవ్వు ఉన్నటువంటి పదార్థాలను తినకూడదు. ఇలాంటివి తింటే రక్తపోటు పెరుగిపోతుంది. ఆహారంలో కొన్ని పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు చేర్చినట్లయితే రక్తపోటును నియంత్రించవచ్చు. అయితే ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం. 1. గుమ్మడి గింజల్లో ఎన్నో పోషకాలు అనేవి ఉంటాయి. వీటిని తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇందులో ముఖ్యంగా పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచేలా చేస్తాయి. అలాగే ఫ్యాటీ ఫిష్ తినడం వల్ల కూడా హైబీపీ నియంత్రణలో ఉంటుంది. చేపలలో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మన హృదయాన్ని ఫిట్‌గా ఉంచడంతో పాటు.. రక్తపోటును నియంత్రించేందుకు సహాయపడతాయి. 2. ఇప్పుడు ప్రజల్లో మారిన జీవనశైలి వల్ల చాలామందికి కిడ్నీలలో రాళ్లు ఏర్పడుతున్నాయి. దీనికి కారణాలు ఎన్నో ఉన్నాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు చాలా ఇబ్బందులు పడతారు. ఇందుకోసం కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటంటే.. తులసి ఆకుల రసాన్ని తీసి దానికి ఒక చెంచా తేనె కలిపాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం, సాయంత్రం పూట తీసుకోవాలి. ఇలా చేస్తే కిడ్నీ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాదు కిడ్నీలో రాళ్లను తొలగించేందుకు టొమాటో రసం ఎంతగానో ఉపయోగపడుతుంది. ముందుగా రెండు టమోటాలు బాగా కడిగి వాటిని మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత ఈ జ్యూస్‌లో ఉప్పు, మిరియాల పొడి కలుపుకుని తాగాలి. అలాగే ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఉంచి జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు. 3. ఇక నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కూడా కిడ్నీలోని రాళ్లను తొలగించడంలో చక్కగా పనిచేస్తుంది. పెరుగును ఒక గిన్నెలో తీసుకుని అందులో చెంచా నిమ్మరసం వేసి రుచికి తగినట్లుగా ఉప్పు వేయాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకుని తాగాలి. ఇలా చేస్తే కిడ్నీలో రాళ్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. Also Read: మంచి ఆహారం ఆరోగ్యానికి పరమౌషధం #health-news #high-bp #kidneys మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి