Bengalore Traffic: ''బెంగళూరులో మాత్రమే ఇలా''..ట్రాఫిక్‌ లో వర్క్‌ చేస్తున్న యువతి!

ప్రపంచంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో రెండో స్థానంలో బెంగళూరు నిలిచిందన్న విషయం తెలిసిందే.తాజాగా ఓ యువతి రద్దీగా ఉన్న రోడ్ల పై బైక్‌ పై వెనుక కూర్చుని ల్యాప్ టాప్‌ ఓపెన్‌ చేసుకుని తన పని చేసుకుంటూ కనిపింది.దీనిని వీడియో తీసిన కొందరు నెట్టింట్లో పెట్టడంతో అది కాస్తా వైరల్‌ గా మారింది

New Update
Bengalore Traffic: ''బెంగళూరులో మాత్రమే ఇలా''..ట్రాఫిక్‌ లో వర్క్‌ చేస్తున్న యువతి!

బెంగళూరులో రోజురోజుకి ట్రాఫిక్‌ కష్టాలు అధికం అయిపోతున్నాయి. బెంగళూరు వాసులు రోడ్ల మీదకు రావాలంటేనే హడలిపోతున్నారు. ఈ క్రమంలోనే ఓ యువతి ట్రాఫిక్‌ లో తన ఆఫీస్‌ పని చేసుకుంటున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతుంది. బైక్‌ పై వెనుక కూర్చున్న యువతి ల్యాప్‌ టాప్ ఓపెన్‌ చేసుకుని తన పని చేసుకుంటుంది. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌ గా మారింది. అంతే కాకుండా దానికి '' బెంగళూరులో మాత్రమే ఇలా'' అంటూ క్యాప్షన్‌ కూడా ఇచ్చారు.

ప్రపంచంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో రెండో స్థానంలో బెంగళూరు నిలిచిందన్న విషయం తెలిసిందే. నగరంలో 2 కిలో మీటర్ల దూరం వెళ్లడానికే గంటల గంటల సమయం పడుతుంది. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో ఆఫీసులకు వెళ్లాల్సిన వారు ఉదయం 6 గంటలకే ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారంటే ట్రాఫిక్‌ కష్టాలు ఏ విధంగా ఉన్నాయో చెప్పక్కర్లేదు.

స్కూళ్లు, కాలేజీలు, ఉద్యోగుల పరిస్థితి ఈ ట్రాఫిక్‌ లో ఎలా ఉంటుందో వివరించలేము. ఇక సెలవుల సమయంలో ట్రాఫిక్‌ కష్టాలు ఎలా ఉంటాయో చెప్పే పనే లేదు. నగరం నుంచి సొంతూర్లకు వెళ్లే నగర వాసులు సొంత వాహనాలతో రోడ్ల పైకి రావడంతో నగరం మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది.

కొద్ది రోజుల క్రితం కూడా ట్రాఫిక్‌ లో చిక్కుకున్న వారికి ఫుడ్‌ డెలివరీ కూడా వారు ఉన్న వద్దకే వచ్చి ఇచ్చిన వీడియో కూడా ఒకటి నెట్టింట్లో వైరల్‌ గా మారింది. తాజాగా ఓ యువతి రద్దీగా ఉన్న రోడ్ల పై బైక్‌ పై వెనుక కూర్చుని ల్యాప్ టాప్‌ ఓపెన్‌ చేసుకుని తన పని చేసుకుంటూ కనిపింది.

దీనిని వీడియో తీసిన కొందరు నెట్టింట్లో పెట్టడంతో అది కాస్తా వైరల్‌ గా మారింది. అంతే కాకుండా దీనికి ‘బెంగళూరులో మాత్రమే ఇలా..’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు.చాలా మంది ఈ ట్రాఫిక్ కష్టాలను అధిగమించడానికి మెట్రో సర్వీసులను ఆశ్రయిస్తున్నారు.

Also read: ఢిల్లీలో స్విట్జర్లాండ్ మహిళ హత్య..వారం కిందటే భారత్‌ కి రాక

Advertisment
Advertisment
తాజా కథనాలు