Bengaluru: మీరు చేసిన పనులకు అన్ని సౌకర్యాలు ఉండవు..దర్శన్‌కు చివాట్లు పెట్టిన కోర్టు నువ్వు చేసింది హత్య చిన్న తప్పు కాదు నీకు కావాల్సిన లగ్జరీలు ఇవ్వడానికి అంటూ బెంగళూరు కోర్టు చివాట్లు వేసింది హీరో దర్శన్‌కు. రేణుకాస్వామి హత్య కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న దర్శన్‌కు ఇంటి భోజనం ఇవ్వడానికి వీలు లేదని తేల్చి చెప్పింది. By Manogna alamuru 25 Jul 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Hero Darshan Petiton: కన్నడ స్టార్ హీరో దర్శన్ అభిమాని మర్డర్ కేసు లో ఇండస్ట్రీలో ఎంతటి కలకలం రేపిందో అందరికీ తెలిసిందే. దర్శన్ కి భార్య పిల్లలు ఉండగా మరో నటి ప్రవిత్రా గౌడతో సన్నిహితంగా ఉంటున్నాడు. రేణుకాస్వామి అనే దర్శన్ అభిమాని పవిత్రను సోషల్ మీడియాలో ఇబ్బంది పెట్టడంతో అతన్ని దర్శన్ హత్య చేయించాడనే ఆరోపణలతో జైలుపాలయ్యాడు. ఈ కేసులో దర్శన్, పవిత్రగౌడతో పాటు మరికొంతమంది కూడా అరెస్ట్ అయ్యారు. రేణుక స్వామి హత్య చేసిన తర్వాత ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. చాలా దారుణంగా హింసించి అతన్ని చంపారు. ప్రస్తుతం దర్శన్, అతని లివింగ్ పార్టనర్ పవిత్ర గౌడ్‌తో పాటూ నిందితులందరూ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తనకు ఇంటి భోజనం కావాలంటూ దర్శన్ వేసిన పిటిషన్‌ను బెంగళూరు కోర్టు తిరస్కరించింది. తనకు దుస్తులు, పరుపు, పుస్తకాలను అనుమతించాలని ఆయన పిటిషన్‌లో కోరారు. దీనికి సంబంధించి మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించాలని ఈ నెల ప్రారంభంలో కర్ణాటక హైకోర్టు దర్శన్‌ని ఆదేశించింది. తనకు జైల్లో పెట్టిన ఆహారం జీర్ణించుకోలేకపోతున్నాని...బరువు తగ్గానని దర్శన్ పిటిషన్ కోర్టులో పిటిషన్ వేశారు. డయేరియాతో బాధపడుతున్నానని..జైలు అధికారులు ఫుడ్ పాయిజన్ అని చెప్పారని అందులో రాశారు, బరువు కూడా తగ్గానని చెప్పారు. అయినా సరే కోర్టు అవన్నీ తోసిపుచ్చింది. హత్య చేసిన వారికి జైల్లో ఉండాల్సిన నిబంధనలు అనుసరించాల్సిందేనని..అన్ని సౌకర్యాలు ఇవ్వలేమని చెప్పింది. Also Read:Paris Olympics: మొదటిరోజే అదరగొట్టారు..క్వార్టర్స్‌కు చేరుకున్న విజయవాడ ఆర్చర్ #bengaluru #court #petition #hero-darshan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి