Hot Water Bath: వేడినీటి స్నానంతో డిప్రెషన్‌కు చెక్‌ పెట్టొచ్చా..?

మానసికంగా ఒత్తిడితో బాధపడేవారు రోజులో అరగంటపాటు గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలని నిపుణులు అంటున్నారు. దీంతో నిద్రబాగా పడుతుందని, మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటారని చెబుతున్నారు. కొద్దికొద్దిగా డిప్రెషన్‌ నుంచి కూడా బయటపడవచ్చని అభిప్రాయపడుతున్నారు.

New Update
Hot Water Bath: వేడినీటి స్నానంతో డిప్రెషన్‌కు చెక్‌ పెట్టొచ్చా..?

జీవనశైలిలో మార్పులు, పని ఒత్తిడి, కుటుంబ సమస్యలతో డిప్రెషన్‌ బారిన పడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం వస్తున్న ఆరోగ్య సమస్యల్లో ఎక్కువశాతం డిప్రెషన్‌తో బాధపడేవారే ఉంటున్నారు. అయితే.. డిప్రెషన్‌కు వేడినీటి స్నానంతో చెక్‌ పెట్టవచ్చని కొందరు శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనాల్లో తేలింది. జర్మనీలోని ఫ్రీబర్గ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 3,500 మందిపై పరిశోధనలు చేశారు. వివిధ రకాల మందులు, థెరపీలే కాకుండా వేడినీటి స్నానం కూడా బాగా పనిచేస్తుందని గుర్తించారు. వేడినీటితో స్నానం చేయడం వల్ల బాధితుల మనసు మారిపోతుందని అంటున్నారు.

ఎక్కువ సేపు స్నానం చేస్తే..

నిజానికి నిత్యం మన శరీరంలో అనేక రకాల జీవరసాయన మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. దీన్నే సిర్కేడియన్ రిథమ్ అని పిలుస్తారు. డిప్రెషన్ లేదా ఒత్తిడితో ఇబ్బంది పడేడవారిలో ఈ రిథమ్‌ దెబ్బతింటుందని అంటున్నారు. అయితే నిత్యం వేడి నీళ్లతో స్నానం చేస్తే ఈ రిథమ్‌పై పాజిటివ్‌ ఎఫెక్ట్‌ ఉంటుందని చెబుతున్నారు. వేసవికాలం తప్ప మిగతా కాలాల్లో మధ్యాహ్నం సమయంలో వేడి వేడి నీళ్లతో ఎక్కువ సేపు స్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రతలు పెరిగి సిర్కేడియన్ రిథమ్ అనేది కంట్రోల్‌లోకి వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

నిద్రబాగా పడుతుంది..

అందుకే మానసికంగా ఒత్తిడితో బాధపడేవారు రోజులో అరగంటపాటు గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలని అంటున్నారు. దీంతో నిద్రబాగా పడుతుందని, మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటారని చెబుతున్నారు. కొద్దికొద్దిగా డిప్రెషన్‌ నుంచి కూడా బయటపడవచ్చని సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఇలా చేస్తే పిండికి పురుగు అస్సలు పట్టదు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నిరివాణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు