Kasuri Methi : స్త్రీలకు కసూరి మేతి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

కసూరి మెంతికూర తీసుకోవడం వల్ల ఋతు సంబంధిత సమస్యలు, క్రమరహిత పీరియడ్స్ వల్ల కలిగే నొప్పి, అలసట నుంచి ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ ప్రయోజనాలు పొందడానికి సలాడ్‌లో కసూరి మేతిని తీసుకోవచ్చు. లేదా సూప్‌లా తాగవచ్చని అంటున్నారు.

New Update
Kasuri Methi : స్త్రీలకు కసూరి మేతి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

Fenugreek Benefits : సూరి మేతి(Fenugreek) చాలా ఆహారాల్లో దీన్ని వినియోగిస్తారు. ఇది ఆహార రుచిని పెంచడమే కాకుండా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. కసూరి మెంతులు తీసుకోవడం వల్ల స్త్రీలల్లో వచ్చే అనేక వ్యాధులను తగ్గిస్తుంది. మెంతి ఆకులను ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తారు. విటమిన్ ఎ, విటమిన్ బి6 మరియు విటమిన్ సి(Vitamins A, B6, C) కాకుండా ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు కసూరి మేతిలో లభిస్తాయి. కసూరి మేతి తింటే కలిగే ప్రయోజనాలపై ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

రక్తహీనత:

  • మహిళల్లో రక్తహీనత సమస్యలు(Anemia Problems In Women) ఎక్కువగా ఉంటాయి. శరీరంలో రక్తహీనత ఉన్న సందర్భాల్లో కసూరి మేతి ప్రయోజనకరంగా ఉంటుంది. కసూరి మెంతికూరలో మంచి మొత్తంలో ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. కాబట్టి దీనిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల మహిళలకు ప్రయోజనం చేకూరుతుంది.

సంతానలేమి:

  • కొంతమంది స్త్రీలు సక్రమంగా ఋతుస్రావం(Periods) రాకపోవడంతో బాధపడుతుంటారు. కసూరి మేతి తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. కసూరి మెంతికూర తీసుకోవడం వల్ల ఋతు సంబంధిత సమస్యలు ఉండవు. అంతే కాకుండా ఇది క్రమరహిత పీరియడ్స్ వల్ల కలిగే నొప్పి, అలసట నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

గర్భం:

  • గర్భధారణ సమయం(Pregnancy Period) లో వైద్యులు సాధారణంగా ఫోలిక్ యాసిడ్ మాత్రలు తీసుకోవాలని సలహా ఇస్తారు. ఇది శిశువు అభివృద్ధికి చాలా ముఖ్యం. కసూరి మేతిలో ఫోలిక్ యాసిడ్ మంచి మొత్తంలో లభిస్తుంది.

చర్మం-జుట్టు:

  • విటమిన్-సి(Vitamin-C) పుష్కలంగా ఉండే కసూరి మేతి తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. విటమిన్ సి చర్మానికి రక్షణ కల్పిస్తుంది. వృద్ధ్యాప్య ఛాయలు కనిపించవు. అంతేకాకుండా కసూరి మెంతులు జుట్టుకు కూడా మేలు చేస్తాయి. దీని వినియోగం చుండ్రు సమస్యతో పాటు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

హార్మోన్ల అసమతుల్యత:

  • చాలా మంది మహిళలు హార్మోన్ల అసమతుల్యత సమస్యతో బాధపడుతుంటారు. కసూరి మేతి తీసుకోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఉండదు. ఎక్కువ ప్రయోజనాలు పొందడానికి సలాడ్‌లో కసూరి మేతిని తీసుకోవచ్చు. లేదా సూప్‌లా తాగవచ్చు.

ఇది కూడా చదవండి : థైరాయిడ్ ఉన్నవారు పల్లీలు తినొచ్చా? డైటీషియన్స్ ఏమంటున్నారు?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: కౌగిలింతలో మజా..బాడీలో వచ్చే మార్పుల వలెనే..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు