Clay Pots: మన పూర్వికులు మట్టి పాత్రల్లో వంట చేయడానికి కారణం ఇదే మట్టి పాత్రలను అన్ని రకాల వంటలకు ఉపయోగించుకోవచ్చు. ఎంత వేడిచేసినా ఇవి తట్టుకుంటాయి. ఆహార పదార్థాలకు రుచికూడా వస్తుంది. డీప్ ఫ్రై, రోస్ట్‌కు బెస్ట్ అని చెప్పవచ్చు. ఆహారంలో తేమను కూడా ఉత్పత్తి చేస్తాయి. రుచి కూడా అదిరిపోతుంది. అరిగిపోవు, ఎలాంటి పగుళ్లు కూడా ఉండవు. By Vijaya Nimma 27 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Clay Pots: పూర్వం వంట చేయడానికి మట్టి కుండలు, రాతి కుండలు వాడేవాళ్లు. ప్రస్తుతం అల్యూమినియం, నాన్‌స్టిక్, సిరామిక్, స్టీల్ పాత్రలు వాడుతున్నారు. అయితే ఈ లోహాలను సరిగా ఉపయోగించకపోతే హానికరమని నిపుణులు అంటున్నారు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ మట్టి కుండలు, రాతి పాత్రలను వంట కోసం వాడుతున్నారు. వీటిలో వంట చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. సహజ సిద్ధమైన నాన్ స్టిక్: కుండలను సహజ నాన్‌స్టిక్‌గా చెప్పవచ్చు. వీటి తయారీలో సింథటిక్ పూతలు లేదా రసాయనాలు ఉపయోగించరు. ఎక్కువగా వినియోగించడం వల్ల మృదువుగా మారడంతో పాటు వంట కూడా అడుగంటకుండా ఉంటుంది. అన్ని రకాల వంటలకు: మట్టి పాత్రలను అన్ని రకాల వంటలకు ఉపయోగించుకోవచ్చు. ఎంత వేడిచేసినా ఇవి తట్టుకుంటాయి. అంతేకాకుండా ఆహార పదార్థాలకు రుచికూడా వస్తుంది. డీప్ ఫ్రై, రోస్ట్‌కు బెస్ట్ అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఆహారంలో తేమను కూడా ఉత్పత్తి చేస్తాయి. రుచి కూడా అదిరిపోతుంది. క్లీనింగ్‌కు కూడా అనువుగా ఉంటాయి: ఎక్కువగా శుభ్రం చేయడం వల్ల మామూలు పాత్రలకు అయితే కోటింగ్ పోతుంది. అంతేకాకుండా తొందరగా పాడైపోతాయి. కానీ మట్టిపాత్రలు, స్టోన్ పాత్రలు సహజసిద్ధంగా తయారైనందున ఎక్కువ కాలం పాడుకావు. అరిగిపోవు, ఎలాంటి పగుళ్లు కూడా ఉండవు. జిడ్డు మరకలు కూడా తొందరగా పోతాయి. మసాలా కూరలకు అనుకూలం: స్టోన్‌వేర్ పాత్రల్లో ఏదైనా మసాలా కర్రీ చేయాలంటే చాలా సులభంగా ఉంటుంది. క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది. తక్కువ మంటపై 2 నిమిషాలు వేడిచేసి కాటన్ క్లాత్‌తో శుభ్రం చేసుకోవచ్చు. చల్లారిన తర్వాత తేలికపాటి డిష్‌వాషింగ్ లిక్విడ్‌తో కడిగేయవచ్చు. అలాగే 30 సెకన్ల పాటు వేడి చేసి తర్వాత కొద్దిగా నూనె లేదా కొబ్బరి నూనెను అప్లై చేసి గుడ్డతో తుడవాలి. దీంతో సులభంగా మరకలు పోతాయి. ఇది కూడా చదవండి: 6 నెలల లోపు పిల్లల శరీరం చల్లగా మారితే కంగారు పడొద్దు..ఇలా చేయండి గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. #health-benefits #clay-pots మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి