Hacking: హ్యాకింగ్ వ్యవహారంలో మరో ట్విస్టు.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. విపక్ష నేతలకు యాపిల్ నుంచి అలర్ట్ నోటిఫికేషన్లు రావడంతో దీనిపై కేంద్రం విచారణకు ఆదేశించిన తరుణంలో మరో ట్విస్టు చోటుచేసుకుంది. అయితే ఈ వ్యవహారం కంటే ముందుగానే కేంద్రం యాపిల్ యూజర్లకు ఓ అలర్ట్ జారీ చేసింది. By B Aravind 01 Nov 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి దేశంలో కొంతమంది విపక్షనేతలకు యాపిల్ సంస్థ నుంచి హ్యకింగ్ అలెర్టు మెసేజ్‌లు రావడం చర్చనీయాంశమవుతోంది. అయితే ఈ వ్యవహారంపై కేంద్రం ఇప్పటికే దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో ట్విస్టు చోటుచేసుకుంది. ఈ ఘటనకు ముందే కేంద్రం యాపిల్ యూజర్లకు అలర్డ్ జారీ చేసింది. యాపిల్ ఉత్పత్తుల్లో భద్రతాపరమైన లోపాలు ఉన్నట్లు గుర్తించి ఓ హెచ్చరికను పంపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రభుత్వానికి చెందిన కంప్యూటర్ అత్యవసర స్పందన బృందం (CERT) యాపిల్ యూజర్లకు ఇటీవలే ఓ అడ్వైజరీని జారీ చేసింది. ఐఫోన్, యాపిల్ వాచ్, మ్యాక్‌బుక్ ఆపరేటింగ్ సిస్టమ్‌లతో సహా సఫారీ బ్రౌజర్‌లో కూడా భద్రతాపరమైన లోపాలు గుర్తించినట్లు ఈ బృందం పేర్కొంది. ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్ 17.1 కంటే ముందు వెర్షన్లు, మ్యాక్ ఓఎస్ సోనోమా వెర్షన్ 14.1 కంటే ముందు వెర్షన్లు, వెంట్యురా వెర్షన్ 13.6.1, మానిటరీ వెర్షన్స్ 12.7.1 కంటే ముందు వెర్షన్లలో లోపాలు ఉన్నట్లు గుర్తించామని చెప్పింది. అలాగే యాపిల్‌కు చెందిన ఇంటర్నెట్ బ్రౌజర్ సఫారీ 17.1 కంటే ముందున్న వెర్షన్లలో కూడా లోపాలు గుర్తించినట్లు సెర్ట్ పేర్కొంది. Also read: కేటీఆర్, రేవంత్ రెడ్డి ఫోన్లకు హ్యాకింగ్ హెచ్చరిక.. బీజేపీ నేతలు ఏమన్నారంటే ఆయా ఉత్పత్తుల్లో బహుళ లోపాలు ఉన్నట్లు సెర్ట్.. హ్యాకర్లు డివైజులను తమ నియంత్రణలోకి తీసుకుని సున్నితమైన సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు అక్టోబర్ 27న సెర్ట్ ఓ అడ్వైజరీని పంపించింది. అంతకుముందూ కూడా ఇలాంటిదే ఓ అలర్ట్ జారీ చేసింది. వెంటనే లేటెస్ట్ ఐఓఎస్, మ్యాక్ ఓఎస్, టీవీ ఓఎస్, వాచ్ ఓఎస్‌తో సహా సఫారీ బ్రౌజర్‌ను కూడా అప్‌డేట్ చేసుకోవాలని యూజర్లకు సూచనలు చేసింది. ఈ హెచ్చరిక వచ్చిన కొన్నిరోజులకే విపక్ష ఎంపీలకు వార్నింగ్ సందేశాలు రావడం గమనార్హం. ఇదిలాఉండగా హ్యాకింగ్ వ్యవహారంపై యాపిల్ సంస్థను పార్లమెంటరీ ప్యానెల్ విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. #telugu-news #national-news #hacking #apple-company మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి