Waynad: అరేబియా సముద్రం వేడెక్కింది..అందుకే వయనాడ్‌లో విలయం

వయనాడ్‌లో జరిగిన బీభత్సం అందరినీ భయపెడుతోంది. భారతదేశానికి ఏమైంది అనే అనుమానాలు రేకెత్తిస్తోంది. వాతావరణశాఖ నిపుణులు, శాస్త్రవేత్తలు కూడా ఈ భారీ విలయానికి ఆశ్చర్యపోతున్నారు. అరేబియా సముద్రం విపరీతంగా వేడెక్కడమే ఈ విలయానికి కారణం అయి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

New Update
Waynad: అరేబియా సముద్రం వేడెక్కింది..అందుకే వయనాడ్‌లో విలయం

Waynad Nature Disaster: కేరళలోని వయనాడ్‌ జిల్లా ప్రకృతి విపత్తులతో అతలాకుతలమైంది. భారీ వర్షం కారణంగా వాయనాడ్ కొండచరియలు విరిగిపడటంతో 108 మంది మరణించారు. గ్రామాలకు గ్రామాలే నామరూపాలు లేకుండా పోయాయి. ఎన్నో ఇళ్లు నేలమట్టమయ్యాయి. భారీ రెస్క్యూ ఆపరేషన్‌లు జరుగుతున్నాయి. కొంతమందినే వెలికితీయగలిగారు. ఇంకా చాలా మంది శిథిలాల కింద చిక్కకుని పోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మంగళవారం, జూలై 30, బుధవారం, జూలై 31వ తేదీలలో రెండు రోజుల రాష్ట్రవ్యాప్త సంతాప దినాలను ప్రకటించారు. ఈ ప్రమాదంలో 116 గాయాలవగా.. చాలామంది అచూకీ తెలియలేదని కేరళ రెవెన్యూ మంత్రి కార్యాలయం నివేదించింది.

అరేబియా సముద్రం వేడెక్కిపోయింది...

ఈ ప్రకృతి పరిణామం మీద శాస్త్రవేత్తలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అరేబియా సముద్రం వేడెక్కడమే కారణమని భావిస్తున్నారు. చాలా కొద్ది సేపటిలోనే మామూలు వర్షాల నుంచి భారీ వర్షాు పడ్డయని...దాని కారణంగానే కొండచరియలు విరిగపడ్డాయని చెబుతున్నారు. అరేబియా సముద్రం వేడెక్కడం కారణంగా డీప్ క్లౌడ్ సిస్టమ్స్ ఏర్పడి.. తక్కువ వ్యవధిలో కేరళలో అత్యంత భారీ వర్షాలు కురిశాయని చెబుతున్నారు. రుతుపవాలు దానికి తోడు ఆఫ్ షోర్ ద్రోణి కూడా ఏర్పడిందని...దాని వలన కాసర్‌గోడ్, కన్నూర్, వాయనాడ్, కాలికట్, మలప్పురం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లోని అడ్వాన్స్‌డ్ సెంటర్ ఫర్ అట్మాస్ఫియరిక్ రాడార్ రీసెర్చ్ డైరెక్టర్ ఎస్ అభిలాష్ తెలిపారు. అరేబియా సముద్రంలో మేసోస్కల్ క్లౌడ్ వ్యవస్థ ఏర్పడింది. దీనికి కారణం కొంకణ్ ప్రాంతం తేమగా ఉండడమే అని తెలిపారు. ఈ కారణాల వల్లనే వాయనాడ్, కాలికట్, మలప్పురం, కన్నూర్‌లలో అత్యంత భారీ వర్షాలు కురిశాయని..ఆ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయని ఆయన తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో 30 సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని అభిలాష్ చెప్పారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Uttar Pradesh : ఐదుగురు పిల్లల తల్లి, నలుగురు పిల్లల తండ్రితో జంప్!

ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌లో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఐదుగురు పిల్లల తల్లి అదే గ్రామంలో నివసించే నలుగురు పిల్లల తండ్రితో లేచిపోయింది. ఇది మాత్రమే కాదు, ఆమె తన ప్రియుడిని వివాహం చేసుకున్న ఫోటోను కూడా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.

New Update
marriage 2nd

marriage 2nd

ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌లో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఐదుగురు పిల్లల తల్లి అదే గ్రామంలో నివసించే నలుగురు పిల్లల తండ్రితో లేచిపోయింది. ఇది మాత్రమే కాదు, ఆమె తన ప్రియుడిని వివాహం చేసుకున్న ఫోటోను కూడా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఇద్దరి కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిసింది. 

ఈ సంఘటన ఏప్రిల్ 5వ తేదీన జరిగింది. సిద్ధార్థ్ నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని మహారియా గ్రామానికి చెందిన గీత అనే మహిళ తన ఐదుగురు పిల్లలను, భర్తను వదిలి ఇంట్లోని నగదు, నగలను తీసుకుని అదృశ్యమైంది. తన భార్య తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి ఉండవచ్చని ఆమె భర్త  శ్రీ చంద్ అనుకున్నాడు. కానీ మూడు రోజుల తర్వాత గ్రామానికి చెందిన గోపాల్ అనే యువకుడితో అతని భార్య పెళ్లి ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.  ఇది చూసి ఆ మహిళ భర్త శ్రీ చంద్ షాక్ అయ్యాడు. 

పెద్ద కూతురికి 19 సంవత్సరాలు

శ్రీ చంద్ కు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు సహా 5 మంది పిల్లలు ఉన్నారు. పెద్ద కూతురికి దాదాపు 19 సంవత్సరాలు, చిన్న కూతురికి 5 సంవత్సరాలు. శ్రీ చంద్ గతంలో ముంబైలోని ఒక వడా పావ్ దుకాణంలో పనిచేసేవాడు. గత కొన్ని రోజులుగా, అతను గ్రామంలో కూలీగా పనిచేస్తూ తన పిల్లలను పోషించుకుంటున్నాడు. తన భార్య ఇంట్లో నుంచి తీసుకెళ్లిన నగలు, రూ.90 వేలు తిరిగి ఇవ్వాలని, ఇకపై ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని  శ్రీ చంద్ చెప్పాడు.

మరోవైపు, శ్రీ చంద్ భార్యతో పారిపోయిన ప్రేమికుడు గోపాల్ పట్వాకు నలుగురు పిల్లలు ఉన్నారు. గోపాల్ ముంబైలో రాఖీ తయారీదారుగా కూడా పనిచేసేవాడని అతని భార్య చెప్పింది. అతను చాలా కాలంగా కుటుంబానికి ఖర్చులు ఇవ్వడం లేదని తెలిపింది.  తాను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో స్వీపర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నానని తెలిపింది.  ఇప్పటి వరకు తాను అన్నీ భరించాను కానీ ఇప్పుడు తన భర్త  రెండో  వివాహం చేసుకున్నాడు కాబట్టి, ఆస్తిలో తన పిల్లలకు వాటా ఇవ్వాలని కోరుతానంది.  ఈ విషయం గురించి తాను పోలీస్ స్టేషన్ కు వెళ్లానని, కానీ ఎవరూ తన మాట వినలేదని గోపాల్ భార్య చెబుతోంది. 

Also read :  Crime: ఛీ.. ఛీ వీడు మనిషేనా! పదేళ్ల బాలికను రేప్ చేసి.. ఆ తర్వాత

 

 

 

Advertisment
Advertisment
Advertisment