BCCI : హెడ్ కోచ్ పదవికి నోటిఫికేషన్ రిలీజ్.. షరతులు ఇవే!

భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) పురుషుల టీమ్ కు హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. మూడున్నరేండ్ల పదవికోసం ఆసక్తిగల వారు ఈ నెల 27వ తేదిలోపు అప్లై చేసుకోవాలని సూచించింది.

New Update
BCCI : హెడ్ కోచ్ పదవికి నోటిఫికేషన్ రిలీజ్.. షరతులు ఇవే!

Coach Notification : భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(BCCI) పురుషుల టీమ్ కు హెడ్ కోచ్(Head Coach) పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. మూడున్నరేండ్ల పదవికోసం ఆసక్తిగల వారు ఈ నెల 27వ తేదిలోపు అప్లై చేసుకోవాలని సూచించింది.

Also Read : కాలి గాయంతో టీ20 ప్రపంచకప్ కు దూరంకానున్న స్టార్ ఆటగాడు..

ఈ ఎంపిక ప్రక్రియలో ముందుగా దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తామని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. 2024 T20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే రాహుల్ ద్రావిడ్ కోచ్ బాధ్యతలనుంచి తప్పుకోగా.. కొత్త కోచ్ జూలై 1 నుంచి జట్టు బాధ్యతలు చేపడతాడని పేర్కొంది. కొత్త కోచ్ పదవీ కాలం 2027 డిసెంబర్ 31, తో ముగుస్తుందని తెలిపింది. 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అభ్యర్థి కనీసం 30 టెస్టులు లేదా 50 ODIలు ఆడివుండాలని, కనీసం రెండేళ్ల పాటు క్రికెట్ తో సంబంధాలు కలిగి ఉండాలని స్పష్టం చేసింది. టీ20 ప్రపంచకప్(T20 World Cup) తర్వాత ఉద్యోగంలో కొనసాగాలంటే ద్రవిడ్ మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని బీసీసీఐ సెక్రటరీ జే షా ఇటీవల తెలిపారు. కానీ ద్రవిడ్ ఇప్పటికే కష్టంగా కొనసాగుతున్నాడని, మరోసారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా లేడని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

#t20-world-cup #bcci #notification-for-the-post-of-head-coach #odi
Advertisment
Advertisment
తాజా కథనాలు