Budget 2024: తగ్గనున్న బ్యాటరీ, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు

లిథియం, కాపర్, కోబాల్ట్ లాంటి 25 ఖనిజాల మీద కస్టమ్స్ సుంకాలను పూర్తిగా మినహాయించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని కారణంగా బ్యాటరీల ధరలు తగ్గుతాయి. బ్యాటరీల ధరలు తగ్గితే ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా భారీగా తగ్గే అవకాశం ఉంది.

New Update
Budget-Students: బడ్జెట్‌ లో విద్యార్థులకు తీపికబురు.. విద్యా రుణాలపై!

Exemption of customs duty on minerals: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ 2024లో ఎలక్ట్రిక్ వాహనాల ధరల తగ్గింపుకు అనుకూలంగా ప్రతిపాదనలు చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రధానమైన బ్యాటరీలలో వాడే లిథియం, కోబాల్ట్ లాంటి అరుదైన 25 ఖనిజాల మీద కస్టమ్స్ సుంకాలు పూర్తిగా మినహాయించాలని...రెండింటిపై బీసీడీ తగ్గించాలని ఆమె ప్రతిపాదించారు. బీసీడీ ఖనిజాల ప్రాసెసింగ్, శుద్ధీకరణకు ప్రధాన పూరకాన్ని అందిస్తుంది. ఈ ఖనిజాలు అణుశక్తి, పునరుత్పాదక ఇంధనం, అంతరిక్షం, రక్షణ, టెలికమ్యూనికేషన్స్, హైటెక్ వంటి రంగాలలో బాగా ఉపయోగిస్తారు.

ఖనిజాలపై కస్టమ్స్ సుంకాలను తగ్గించడం వలన ఆటో మొబైల్ రంగం అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. లిథియం-అయాన్ బ్యాటరీల ధరలను తగ్గించడానికి కస్టమ్స్ పుంకాల మినహాయింపు దారి తీస్తుంది. దాని ద్వారా బ్యాటరీలు ధరలు తగ్గుతాయి. లిథియం-అయాన్ బ్యాటరీలను ఉపయోగిస్తాయి కాబట్టి ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా బాగా తగ్గుతాయి. ఇది ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధికి దోహదపడుతుంది. అయితే దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ, తయారీని పెంచడానికి 2024 బడ్జెట్ నుండి ఆటోమొబైల్ రంగం ఎదురుచూసే FAME IIIపై మాత్రం బడ్జెట్‌లో ఎటువంటి ప్రతిపాదనా చేయలేదు.

Also Read:Budget 2024: అణు విద్యుత్ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు

Advertisment
Advertisment
తాజా కథనాలు