రూ.95వేల శాలరీతో బ్యాంక్ నోట్ ప్రెస్‌లో జాబ్స్‌.. పూర్తి వివరాలివే..!

సూపర్‌వైజర్, ఇతర పోస్టుల కోసం BNP దేవాస్ ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వనిస్తోంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్ట్‌ల కోసం ఆగస్టు 21లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. సూపర్‌వైజర్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్‌కి గరిష్టంగా 95వేల శాలరీ వస్తుంది. ఇది 27వేలు, 21 వేల రూపాయలతో మొదలువుతుంది. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా/ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

New Update
రూ.95వేల శాలరీతో బ్యాంక్ నోట్ ప్రెస్‌లో జాబ్స్‌.. పూర్తి వివరాలివే..!

Bank Note Press Recruitment 2023: సూపర్‌వైజర్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్‌తో పాటు ఇతర పోస్టుల కోసం బ్యాంక్ నోట్ ప్రెస్(BNP), దేవాస్ (MP) దరఖాస్తులను ఆహ్వానించింది. అప్లికేషన్‌ని ఫిల్‌ చేయడానికి చివరి తేదీ ఆగస్టు 21. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ clickhere ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

బ్యాంక్ నోట్ ప్రెస్ రిక్రూట్‌మెంట్ వివరాలు:

మొత్తం ఖాళీలు: 111 పోస్టులు
➼ సూపర్‌వైజర్ (ప్రింటింగ్): 8 పోస్టులు

•సూపర్‌వైజర్ (కంట్రోల్): 3 పోస్టులు

➼ సూపర్‌వైజర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ): 1 పోస్ట్

• జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్: 4 పోస్టులు

➼ జూనియర్ టెక్నీషియన్ (ప్రింటింగ్): 27 పోస్టులు

• జూనియర్ టెక్నీషియన్ (కంట్రోల్): 45 పోస్టులు

➼ జూనియర్ టెక్నీషియన్ (అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్ ప్లాంట్) / లేబొరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్)/ మెషినిస్ట్ / మెషినిస్ట్ గ్రైండర్ / ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్): 15 పోస్టులు

• జూనియర్ టెక్నీషియన్ (మెకానికల్ / ఎయిర్ కండిషనింగ్): 3 పోస్టులు

➼ జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ): 4 పోస్టులు

• జూనియర్ టెక్నీషియన్ (సివిల్ / ఎన్విరాన్‌మెంట్): 1 పోస్ట్

అర్హత:
అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా/ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

పే స్కేల్ :
➼ సూపర్‌వైజర్: రూ. 27,600 – రూ. 95,910

• జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్: రూ 21,540 – రూ 95,910

➼ జూనియర్ టెక్నీషియన్: రూ. 18,780 – రూ. 67,390

వయసు:
అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి.

ఫీజ్:
UR/ OBC/ EWS : రూ. 600

SC / ST / Ex-SM / PWD: రూ 200

ఎలా దరఖాస్తు చేయాలి? :
• Bank Note Press Recruitment Official website bnpdewas.spmcil.com అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి

➼ కెరీర్(career) విభాగానికి వెళ్లండి

• రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయండి

➼వివరాలు నమోదు చేసుకోండి

• అప్లికేషన్‌ ఫారమ్‌ని ఫిల్ చేయండి

➼ అవసరమైన అన్ని డాక్యుమెంట్స్‌ని అప్‌లోడ్ చేయండి

• దరఖాస్తు రుసుము చెల్లించండి

➼ ఫ్యూచర్‌ పర్పెస్ కోసం ప్రింటవుట్ తీసుకోండి

మరిన్ని వివరాల కోసం ఇక్కడ నోటిఫికేషన్‌ పీడీఎఫ్‌పై క్లిక్‌ చేయండి

Also Read: ప్రముఖ సంస్థలో అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్‌ రిలీజ్‌.. 647 ఖాళీలకు దరఖాస్తు చేసుకోండిలా..!

Advertisment