Bank Jobs: నిరుద్యోగులకు అలెర్ట్.. 1,025 పోస్టుల దరఖాస్తుకు ముగుస్తున్న గడువు.. త్వరపడండి! PNB స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇవాళ్టితో ముగించనుంది. అర్హత గల అభ్యర్థులు PNB అధికారిక వెబ్‌సైట్‌ని విజిట్ చేసి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో మొత్తం 1,025 పోస్టులను భర్తీ చేస్తారు. అప్లికేషన్ ఫీజ్ రూ.1,180. By Trinath 25 Feb 2024 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Punjab National Bank Recruitment: పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్(SO) పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు విండో ఇవాళ( ఫిబ్రవరి 25, 2024) ముగియనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి. దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ pnbindia.in ని విజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 1025 పోస్టులకు నియామకాలు జరుగుతాయి. దరఖాస్తు రుసుము: SC/ST/PWBD కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 59. ఇతర కేటగిరీ అభ్యర్థులకు రూ. 1180. దరఖాస్తు రుసుమును డెబిట్ కార్డ్ (రూపే/వీసా/మాస్టర్ కార్డ్), క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, IMPS, క్యాష్ కార్డ్ ద్వారా చెల్లించవచ్చు. మొబైల్ వాలెట్ లేదా UPIని ఉపయోగించి చేయవచ్చు. ఎలా దరఖాస్తు చేయాలి? --> అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి కింద ఇచ్చిన స్టెప్స్‌ను ఫాలో కావాలి. --> pnbindia.in అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి. --> హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న రిక్రూట్‌మెంట్ విభాగంపై క్లిక్ చేయండి. -->పేజీలో అందుబాటులో ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్ లింక్‌పై క్లిక్ చేయండి. --> అభ్యర్థులు ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీనికి కొత్త డ్రాప్ డౌన్ బాక్స్ ఓపెన్ అవుతుంది. --> మీ వివరాలు నమోదు చేసుకోండి.. దరఖాస్తు ఫారమ్‌ను ఫిట్ చేయండి. --> దరఖాస్తు రుసుము చెల్లించండి. --> సమర్పించు(submit)పై క్లిక్ చేయండి. --> తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ప్రింట్ తీసుకోని మీ దగ్గర ఉంచుకోండి. Also Read: ఎస్‌ఎస్‌సీ అభ్యర్థులకు అలెర్ట్.. కొత్త వెబ్‌సైట్ గురించి కీలక అప్‌డేట్! WATCH: #latest-jobs #punjab-national-bank #punjab-national-bank-recruitment మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి