Karimnagar: దేవుడిని నమ్మని వాళ్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ఓటేయండి.. బండి సంచలన కామెంట్స్ కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. 'ప్రజాహిత యాత్ర'లో భాగంగా మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో బీజేపీ 4వందలకుపైగా సీట్లు గెలుస్తుందన్నారు. 'రాముడిని మొక్కే వాళ్లంతా బీజేపీకి ఓటేయండి. దేవుడిని నమ్మని వాళ్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ఓటేయండి' అని అన్నారు. By srinivas 12 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Bandi Sanjay in Prajahita Yatra : బీజేపీ నాయకుడు బండి సంజయ్ (Bandi Sanjay) మరోసారి హిందుమతానికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాహిత యాత్రలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ (Vemulawada) నియోజకవర్గంలో యాత్ర చేస్తున్నారు బండి సంజయ్. ఈ క్రమంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బాలరాజుపల్లె మీదుగా చెక్కపల్లి, నూకలమర్రి గ్రామం వరకు ఆయా గ్రామాల్లో పాదయాత్ర చేశారు. అనంతరం నూకలమర్రిలో ప్రజలను ఉద్దేశించి బండి ప్రసంగించారు. డ్రామాలాడుతున్నారు.. అసెంబ్లీ సమావేశాలను ఉద్దేశిస్తూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ అసెంబ్లీ సాక్షిగా డ్రామాలాడుతున్నాయని ఆరోపించారు. 12వందల టీఎంసీలకుపైగా క్రిష్ణా నీటిని (Krishna River) కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) పార్టీలు ఏపీకి దోచిపెట్టింది నిజం కాదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో 812 టీఎంసీల నీటిని సీమకు దోచిపెట్టారు. కాంగ్రెస్ పాలనలో 4 వందల టీఎంసీల నీటిని ఏపీకి కట్టబెట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై అసెంబ్లీలో ఎందుకు చర్చించడం లేదు? హామీల అంశాన్ని దారి మళ్లించేందుకే కాంగ్రెస్ డ్రామాలాడుతోందన్నారు. గత సర్కార్ మోసాలు బయట పడకుండా బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తోందని, బడ్జెట్ సాక్షిగా హామీల అమలుపై కాంగ్రెస్ చేతులెత్తేసిందన్నారు. రెండు పార్టీలు కలిసి దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చి ప్రజల నోట్లో మట్టికొట్టారని మండిపడ్డారు. పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ లేదు.. అలాగే బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు ప్రచారం ఆ రెండు పార్టీల కుట్రనే అన్నారు. 4 వందలకుపైగా సీట్లను బీజేపీ గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ తమ పార్టీకి లేదని, హామీలను విస్మరించిన కాంగ్రెస్ ను కడిగిపారేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 'బీఆర్ఎస్ కు ఓటేస్తే డ్రేనేజీలో వేసినట్లే. రాముడిని మొక్కే వాళ్లంతా బీజేపీకి ఓటేయండి. దేవుడిని నమ్మని వాళ్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ఓటేయండి' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తాను మళ్లీ ఎంపీగా గెలిపిస్తే ఎములాడ రాజన్న, కొండగట్టు అంజన్న ఆలయాలను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని మాటిచ్చారు. ఇది కూడా చదవండి : Revanth Vs Harish: హరీశ్ పచ్చి అబద్ధాల కోరు.. దొంగ బుద్ది మార్చుకోవాలి: సీఎం రేవంత్ దేవుడిని నమ్మని వాళ్లు.. అయోధ్య రాముడి కట్టినప్పుడు వాళ్లు దేవుడికి మొక్కారా? ఏమని మొక్కుకున్నరు? అని ప్రశ్నించారు. 5 వందల ఏళ్ల భారత ప్రజల చిరకాల కల నెరవేర్చిన మోడీ మళ్లీ ప్రధాని (PM Modi) కావాలని దేవుడిని మొక్కండని కోరారు. అయోధ్య అక్షింతలను కూడా రేషన్ బియ్యమంటూ హేళన చేస్తూ మోడీ అంటే కళ్లమంటతో కాంగ్రెస్ నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడిని నమ్మని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు ఎందుకు ఓటేయాలి? రాముడిని మొక్కేటోళ్లంతా అయోధ్య గుడి కట్టిన బీజేపీకి ఓటేయండి అన్నారు. కేసీఆర్ మోసం చేసిండు.. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి కేసీఆర్ రూ.500 కోట్లు ఇస్తానని మోసం చేసిండు. వేములవాడ పట్టణంలో బ్రిడ్జి రెండుసార్లు కూలింది.. ఆ పనులు 5 ఏళ్లుగా సాగుతూనే ఉన్నాయి. బ్రిడ్జి నుంచి రాజన్న ఆలయం బద్ది పోచమ్మ గుడి వద్ద నుంచి పోలీస్ స్టేషన్ వరకు రహదారి విస్తరణ కోసం జనం ఎదురుచూస్తున్నారు. మూల వాగుపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పనులు ఎందుకు ఆగిపోయాయో.. ఎందుకు పూర్తి చేయడం లేదో తెలియక ప్రజలు గందరగోళంలో ఉన్నారని వాపోయారు. గుడి చెరువు పూర్తి కాలేదు. పట్టణంలోని మురికి నీరంతా గుడి చెరువులోకి వస్తున్నాయని, మురికి కాలువ నీరు గుడి చెరువులో కలుస్తుందని, వెంటనే కాలువ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆ బాధ్యత తీసుకుంటానని హామీ.. వేములవాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం రూ. 575 కోట్ల 95 లక్షలకుపైగా నిధులిచ్చిందని తెలిపారు. ఆ వివరాలను చదివి విన్పించారు. వేములవాడ నియోజకవర్గంలో నిర్మిస్తున్న రోడ్ల నిధులన్నీ కేంద్రానివే. నూకల మర్రి గ్రామాభివ్రుద్ధికి కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసిందన్నారు. దమ్ముంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఎములాడ నియోజకవర్గ డెవలప్ మెంట్ కు ఖర్చు చేసిన నిధులను వెల్లడించాలన్నారు. ఎములాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిధులిస్తామని, ప్రసాదం స్కీం కింద ప్రతిపాదనలు పంపాలని కోరినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. తనను మళ్లీ ఎంపీగా గెలిపిస్తే రాజన్న, కొండగట్టు అంజన్న ఆలయాలను మరింత అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. #brs #congress #bandi-sanjay #sensational-comments మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి