Pune : ఎట్టకేలకు దిగి వచ్చిన కోర్టు.. నిందితుల బెయిల్ రద్దు!

పూణెలో మద్యం తాగి కారు నడిపి ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల మృతికి కారణమైన మైనర్‌ బాలుడికి కేవలం గంటల వ్యవధిలోనే బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో దిగి వచ్చిన కోర్టు బాలుడికి మంజూరు చేసిన బెయిల్‌ ని రద్దు చేసింది.

New Update
Pune Car Accident: పూణే కేసులో  ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. ఫోరెన్సిక్ రిపోర్టును మార్చి దొరికిపోయిన డాక్టర్లు!

Bail Cancel : పూణె (Pune) లో మద్యం తాగి కారు నడిపి ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల మృతికి (Software Employees Death) కారణమైన మైనర్‌ బాలుడికి (Minor Boy) కేవలం గంటల వ్యవధిలోనే బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. బాధిత కుటుంబాలు, ప్రజల నుంచి ఆందోళనలు వ్యక్తం కావడంతో న్యాయస్థానం దిగొచ్చింది. దీంతో మైనర్ బాలుడికి ఇచ్చిన బెయిల్‌ను జువైనల్ జస్టిస్ బోర్డు రద్దు చేసింది.

బాలనేరస్థుడిని జూన్ 5 వరకు రిమాండ్ హోమ్‌కు పంపింది. అయితే అతడిని వయోజనుడిగా విచారించాలా వద్దా అనే దానిపై మాత్రం కోర్టు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆదివారం అర్ధరాత్రి పలువురు బాలురు బార్‌లో పీకలదాక మద్యం తాగి అనంతరం అతి వేగంగా పోర్షే కారు (Posche Car) ను నడపడంతో ఇద్దరు టెకీలు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం సంఘటనాస్థలికి పోలీసులు చేరుకుని నిందితుల్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ధర్మాసనం యాక్సిడెంట్‌కు కారణమైన బాలుడికి బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా రోడ్డుప్రమాదాలపై వ్యాసం రాసుకుని రమ్మని చెప్పింది.

వ్యక్తిగత బాండ్, రవాణా కార్యాలయాన్ని సందర్శించి అన్ని నియమాలు, నిబంధనలు అధ్యయనం చేసి ప్రజెంటేషన్ ఇవ్వాలని తెలిపింది. మానసిక వైద్యులను సంప్రదించాలని సూచించింది. ఈ తీర్పు దేశ వ్యాప్తంగా ఆగ్రహాన్ని తెప్పించింది. బాధిత కుటుంబాలు న్యాయస్థానం తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి.

అంతేకాకుండా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవిస్ (Fadnavis) కూడా ఈ తీర్పును తప్పుపట్టారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. పోలీస్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇక సోషల్ మీడియా వేదికగా కోర్టుపై నెటిజన్లు మండిపడ్డారు. మొత్తానికి నిరసనలకు తలొగ్గి బెయిల్ రద్దు చేసింది.

Also read: మే 31 నాటికి కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు