Pushpa 2 : ఫ్యాన్స్ కి బిగ్ షాక్ ఇచ్చిన 'పుష్ప'!

'పుష్ప 2' రిలీజ్ వాయిదా పడినట్టు గత రెండు రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మరో షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది. ఈ సినిమా రిలీజ్ ఆగస్టు నుంచి డిసెంబర్ కి షిఫ్ట్ అయిందట. డిసెంబర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.

New Update
Pushpa 2 : ఫ్యాన్స్ కి బిగ్ షాక్ ఇచ్చిన 'పుష్ప'!

Bad News For Pushpa 2 Fans : దేశ వ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ (Cine Lovers) ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నసినిమాల్లో 'పుష్ప 2' (Pushpa 2) ముందు వరుసలో ఉంటుంది. ఈ మూవీ పార్ట్-1 సంచలన విజయం సాధించి పార్ట్-2 పై అమాంతం అంచనాలు పెంచింది. ఇక ఇటీవల రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్ మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఆగస్టు 15 న పుష్ప 2 ను రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించడంతో అందరూ ఆ డేట్ కోసం ఎక్సయిటింగ్ గా వెయిట్ చేస్తున్నారు.

కానీ ఈ విషయంలో ఫ్యాన్స్ కి మేకర్స్ భారీ షాక్ ఇచ్చారు. షూటింగ్ పెండింగ్ తో పాటూ ఇతరాత్ర కారణాల వల్ల సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడనున్నట్టు గత రెండు రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మరో షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది. ఈ సినిమా రిలీజ్ ఆగస్టు నుంచి డిసెంబర్ కి షిఫ్ట్ అయిందట.

Also Read : ‘విశ్వంభర’ లో బాలీవుడ్ యాక్టర్.. అఫీషియల్ గా అనౌన్స్ చేసిన టీమ్, చిరును ఢీ కొట్టేది ఆయనేనా?

ఫ్యాన్స్ కి ఎదురుచూపులు తప్పవా?

'పుష్ప 2' మూవీ రిలీజ్ వాయిదా పడినట్లు మేకర్స్ నుంచి ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం దాదాపు పోస్ట్ పోన్ కన్మర్మ్ అని టాక్ వినిపిస్తుంది. ఒకవేళ అదే జరిగి సినిమా రిలీజ్ ఆగస్టు లో వాయిదా పడితే డిసెంబర్ లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.సెప్టెంబర్ లో 'దేవర', అక్టోబర్ లో 'గేమ్ ఛేంజర్' సినిమాల రిలీజ్ ఉండటంతో ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేయాలను మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రానున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు