Cricket News: షహీన్ ఆఫ్రిదికి షాక్.. బాబర్ ఇజ్ బ్యాక్.. పాక్ షాకింగ్ నిర్ణయం! పాకిస్థాన్ జట్టులో కీలక పరిణామాలు చోటుచేసుంది. పాక్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ తిరిగి జట్టు బాధ్యతలు అందుకున్నాడు. జూన్‌లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌ను బాబర్ నడిపించనున్నాడు. గతేడాది వన్డే వరల్డ్‌కప్‌లో పాక్ వైఫల్యం తర్వాత బాబర్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. By Trinath 31 Mar 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి పాకిస్థాన్ వన్డే, టీ20 కెప్టెన్‌గా బాబర్ ఆజం తిరిగి వచ్చాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సెలక్షన్ కమిటీ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లలో బాబర్‌ని జాతీయ కెప్టెన్‌గా తిరిగి నియమించింది బోర్డు. బాబర్ నియామకం అంటే షహీన్ షా అఫ్రిది ఇకపై పాక్ జట్టుకు ఇకపై టీ20 కెప్టెన్‌గా ఉండడని అర్థం. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో షహీన్ కెప్టెన్‌గా పాకిస్థాన్ 1-4తో ఓడిపోయింది. అతని కెప్టెన్సీలో లాహోర్ ఖలందర్స్ పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 2024 ప్లేఆఫ్‌లకు అర్హత సాధించలేకపోయింది. లాహోర్, రావల్పిండిలో ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 27 వరకు 5 టీ20లు జరగనున్నాయి. బ్లాక్ క్యాప్స్‌పై జరగనున్న ఈ మ్యాచ్‌లకు బాబర్ కెప్టెన్‌గా బాధ్యతలు వహిస్తాడు. పాపం.. షహీన్.. ప్చ్: పాకిస్థాన్‌కు కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని షహీన్ ఆలోచిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి . వరుస వైఫల్యాల తర్వాత పీసీబీ అతనికి ప్రధానత్యను ఇవ్వడం తగ్గించింది. మొహ్సిన్ నఖ్వీ లేదా జాతీయ సెలెక్టర్లు అతడితో అసలు మాట్లాడలేదని సమాచారం. దీంతో ఈ స్టార్ పేసర్ కలత చెందాడని షహీన్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. గతేడాది(2023) భారత గడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్‌లో మెన్ ఇన్ గ్రీన్ సెమీ-ఫైనల్‌కు చేరుకోవడంలో విఫలమైంది. దీంతో బాబర్ పాకిస్థాన్ జట్టు సారథి పదవి నుంచి వైదొలిగాడు. పసికూనలపై ఓటమి: అయితే సెమీస్‌కు వచ్చే జట్లలో పాకిస్థాన్ కూడా ఉంటుందని ఈ వరల్డ్‌కప్ స్టార్ట్ అవ్వడానికి ముందు విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు. ఫస్ట్ రెండు మ్యాచ్‌ను పాక్ గెలిచింది. ఆ తర్వాత అహ్మదాబాద్ వేదికగా భారత్‌పై జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయింది పాక్. అక్కడ నుంచి పాక్ మళ్లీ కోలుకోలేదు. ఆ తర్వాత అఫ్ఘానిస్థాన్ చేతిలో పరాజయం పాలవడం ఆ జట్టు ఘోర స్థితికి నిదర్శనం. రెండు మ్యాచ్‌లు గెలిచాం లేనన్న అలసత్వం పాక్ ప్లేయర్లలో స్పష్టంగా కనిపించిందంటున్నారు విశ్లేషకులు. ఇక ఈ వరల్డ్‌కప్‌లో అన్నిటికంటే దారుణంగా విఫలమైన ఇంగ్లండ్ చేతిలోనూ పాక్ జట్టు ఘోరంగా ఓడిపోయింది. Also Read: అద్వాని పక్కనే ప్రధాని.. భారతరత్న ఇస్తూంటే మోదీ ఏం చేశారో చూడండి! #cricket #babar-azam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి