Ayodhya Ram Mandir: అయోధ్యారాముడికి కొత్తపేరు..ఇక నుంచి ఆపేరుతోనే దర్శనం..!!

అయోధ్య రామాలయంలో కొలువు దీరిన బాలరాముడి విగ్రహాన్ని కొత్త పేరుతో పిలవనున్నారు. ప్రధాని చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట జరిగిన రాముడిని ఇక నుంచి బాలక్ రామ్ అని నామకరణం చేసినట్లు పూజారి అరుణ్ దీక్షిత్ చెప్పారు.

New Update
Ayodhya Ram Mandir: అయోధ్యారాముడికి కొత్తపేరు..ఇక నుంచి ఆపేరుతోనే దర్శనం..!!

Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయంలో సోమవారం ప్రాణప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరిగింది. రాంలల్లా విగ్రహానికి ప్రధాని మోదీ(pm modi) తన చేతుల మీదుగా ప్రాణప్రతిష్ట చేశారు. ఈ వేడుకను యావత్ ప్రపంచం టీవీ, సోషల్ మీడియాతోపాటు పలు మాధ్యమాల ద్వారా వీక్షించారు. అయోధ్యకు స్వయంగా వెళ్లలేని భక్తులు ఎక్కడిక్కడే పూజలు నిర్వహించారు. అయితే ప్రాణ ప్రతిష్ట చేసిన రాంలల్లా విగ్రహాన్ని ఇక నుంచి కొత్త పేరుతో పిలవనున్నారు.

అయోధ్యలో ప్రాణప్రతిష్ట చేసిన రాంలల్లా విగ్రహం ఐదేళ్ల బాలుడిలా నిలబడిన భంగిమలో ఉన్న రాముడిని సూచిస్తుంది. కాబట్టి నుంచి ఆ విగ్రహాన్ని బాలక్ రామ్(Balak Ram) అని పిలవనున్నారు. ముడుపుల కార్యక్రమంలో పాల్గొన్న పూజారి అరుణ్ దీక్షిత్(Priest Arun Dixit) వార్త సంస్థ పిటిఐతో మాట్లాడారు.అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు. జనవరి 22న ప్రతిష్టించిన శ్రీరాముని విగ్రహానికి బాలక్ రామ్ అని పేరు పెట్టారు. రాముడి విగ్రహానికి బాలక్ రామ్ అని పేరు పెట్టేందుకు కారణం ఆయన 5ఏళ్ల వయస్సులో ఉన్న చిన్నపిల్లలా కనిపించడమే అన్నారు.

ఇది కూడా చదవండి: గాజా పోరాటంలో 50 మంది పాలస్తీనియన్లు, 24 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి..!!

నేను మొదటిసారి విగ్రహం చూసినప్పుడు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా కళ్లలోనుంచి నీళ్లు వచ్చాయి. ఆ సమయంలో నేను పొందిన అనుభూతిని మాటల్లో వివరించలేను. జనవరి 18న నాకు తొలిదర్శనం లభించిందని తెలిపారు. కాగా మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన ఈ 51 అంగుళాల విగ్రహాన్ని మూడు బిలియన్ ఏళ్ల నాటి రాతిపై చెక్కారు. ఈ శిల్పానికి ఉపయోగించిన నీలిరంగు కృష్ణ శిలేను మైసూరులోని హెచ్డీ కోట తాలూకా జయపుర హుబ్లీలోని గుజ్జెగౌడనపుర నుంచి తీసుకువచ్చారు.

బాల రామ్ ఆభరణాలపై కూడా పరిశోధనలు జరిగాయి:
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ప్రకారం, అధ్యాత్మ రామాయణం, వాల్మీకి రామాయణం, రామచరితమానస్, అల్వందార్ స్తోత్రం వంటి గ్రంథాలపై తీవ్ర పరిశోధన, అధ్యయనం తర్వాత బాల రాముని విగ్రహానికి ఆభరణాలు తయారు చేశారు. విగ్రహం పసుపు ధోతీ, ఎరుపు 'పతక' లేదా 'అంగవస్త్రం'తో సహా బనారసీ దుస్తులతో అలంకరించారు. 'అంగవస్త్రం' 'జరి' స్వచ్ఛమైన బంగారు దారాలతో, మంగళకరమైన వైష్ణవ చిహ్నాలతో - 'శంఖ', 'పద్మ', 'చక్ర' 'నెమలి'తో అలంకరించారు. ఈ ఆభరణాలను లక్నోలోని అంకుర్ ఆనంద్‌కు చెందిన హర్షహైమల్ శ్యామ్‌లాల్ జ్యువెలర్స్ తయారు చేయగా, ఢిల్లీకి చెందిన టెక్స్‌టైల్ డిజైనర్ మనీష్ త్రిపాఠి దుస్తులను తయారు చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు