Paris Olympics: చరిత్ర సృష్టించిన భారత అథ్లెట్

ఒకపక్క పతకాలు తెస్తారు అనుకున్న వాళ్ళు నిరాశ కలిగిస్తుంటే..మరోపక్క అస్సలు అంచనాలు లేని వాళ్ళు చరిత్ర సృష్టిస్తున్నారు. ఒలింపిక్స్‌లో ఈరోజు 3000m స్టీపుల్ ఛేజ్‌లో భారత అథ్లెట్ అవినాష్ రికార్డ్ క్రియేట్ చేశారు.

New Update
Paris Olympics: చరిత్ర సృష్టించిన భారత అథ్లెట్

Steeple Chase: ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్‌లో పతకం రావడం ఖాయంలా కనిపిస్తోంది. అస్సలు అంచనాలు లేని...ఆ ఆటలో మన ప్లేయర్లు ఉన్నారని కూడా తెలియని దానిలో ఫైనల్స్‌లోకి దూసుకెళ్ళారు అథ్లెట్ అవినాష్. 3000m స్టీపుల్ ఛేజ్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయుడుగగా చరిత్ర సృష్టించారు. ఈ ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరిన మొదటి భారతీయుడిగా నిలిచారు. రౌండ్‌–1లో అవినాష్ 8.15.43 సెకెన్ల సమయంలోనే గమ్యాన్ని చేరుకున టాప్ –5లో ఒకరిగా ఉన్నారు. దీంతో ఈ నెల 8న జరిగే ఫైనల్లో అవినాష్ పోటీ పడనున్నారు. ఇందులో కనుక మొదటి మూడు స్థానాలో ఏ ఒక్క దానిలో నిలిచినా కచ్చితంగా పతకం వస్తుంది.

టేబుల్‌ టెన్నిస్‌ ప్రిక్వార్టర్స్‌లో 3-2 తేడాతో రొమేనియాపై విజయం సాధించిన మనికా బాత్రా, ఆకుల శ్రీజ, అర్చనా కామత్‌లతో కూడిన భారత జట్టు క్వార్టర్స్‌కు చేరింది. ఈ విజయంతో ఒలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్‌ మహిళల ఈవెంట్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న తొలి భారత జట్టుగా రికార్డ్ క్రియేట్ చేసింది. 

Also Read:Paris Olympics: చేతి గాయం వల్లనే ఆడలేకపోయిన లక్ష్యసేన్..

Advertisment
Advertisment
తాజా కథనాలు