Crime: 300 రూపాయల అప్పుకోసం..బాలుడి పై పైశాచికత్వం! మహారాష్ట్రలో మైనర్ బాలుడి పై ఇద్దరు నిందితులు తమ పైశాచికత్వం ప్రదర్శించారు. అప్పుగా తీసుకున్న 300 రూపాయలను తిరిగి ఇవ్వమంటే బాలుడు ఇవ్వను అనడంతో అతడ్ని నగ్నంగా మార్చి బెల్టుతో చితకబాదారు. వారి వద్ద నుంచి తప్పించుకున్న బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. By Bhavana 23 Nov 2023 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి మహారాష్ట్రలోని (Maharashtra) థాణేలో (Thane) ఓ దారుణం జరిగింది. అది కూడా పట్టపగలు అందరూ చూస్తుండగానే. తీసుకున్న అప్పుఉడ తీర్చలేదని ఓ మైనర్ బాలుడి పై ఇద్దరు యువకులు అత్యంత పైశాచికత్వంతో ప్రవర్తించారు. బాలుడ్ని బట్టలిప్పి బెల్టుతో చావగొట్టారు. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు , ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. థాణే శివారు కల్వా మసీదులో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. నిందితులను తౌసిఫ్ ఖాన్‌బాండే, శామిల్ ఖాన్ బాండేలుగా పోలీసులు గుర్తించారు. ముందు వీరిద్దరూ బాలుని ఇంటికి వెళ్లి తమ బ్లూటూత్ డివైజ్ చోరీ జరిగినట్లు ఆరోపించడంతో పాటు తమ వద్ద తీసుకున్న రూ.300 వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే బాధిత బాలుడు నేను దొంగతనం చేయలేదని డబ్బులు కూడా తిరిగి ఇవ్వనని చెప్పాడు. దీంతో కోపంతో ఊగిపోయిన నిందితులు బాలుడ్ని సమీపంలోని మసీదు వద్దకు ఈడ్చుకెళ్లి కాళ్లతో తంతూ, పిడిగుద్దులు గుద్దుతూ చిత్ర హింసలకు గురి చేశారు. అందరూ చూస్తుండగానే బాలుడి బట్టలన్నీ విప్పి నగ్నంగా మార్చి బెల్డుతో చావబాదారు. తౌసీఫ్ బెల్టుతో కొడుతుంటే శామిల్ వీడియో తీశాడు. చివరికి బాలుడే ఎలాగోలా తప్పించుకుని కల్వా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ముందు పట్టించుకోని పోలీసులు వీడియో వైరల్ కావడంతోఎఫ్‌ఆర్ నమోదు చేశారు. https://twitter.com/andharesushama/status/1727264881370656990?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1727264881370656990%7Ctwgr%5Ed4c302c28926ad9eca48f8a26c803d9a8e63569c%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Fnational%2Fatrocity-in-maharashtra-cm-shindes-hometown-1352303 Also read: అసలే చలికాలం..ఇంతలో స్లోగా ఎంట్రీ ఇచ్చిన వరుణుడు! #maharashtra #attack #boy #thane మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి